Home సినిమా పసిడి ధరలు మళ్లీ పైకి! – iDreamPost – Andhra Waves

పసిడి ధరలు మళ్లీ పైకి! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
పసిడి ధరలు మళ్లీ పైకి! - iDreamPost


బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. గతవారం భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ వారం మళ్లీ పెరిగాయి. సోమవారం నుంచి రేట్లు పుంజుకుంటున్నుండగా.. మంగళవారం కూడా అదే ధోరణి కొనసాగుతోంది. దీంతో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేసేవారు తాజా ధరలను గమనిస్తున్నారు. నవంబర్ 24న హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

నవంబర్ 24న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,570గా ఉంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,16,010 వద్ద కొనసాగుతోంది. గతవారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరాల్లోనూ బంగారం ధరలు హైదరాబాద్ ధరలతో సమానంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,570 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,16,010గా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,720గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,160 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,26,570 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,16,010గా ఉంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నవంబర్ 24న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది. ఢిల్లీలోనూ కిలో వెండి ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది.

గతవారం బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. వారం మొత్తంలో తులం బంగారం ధర సుమారు రూ.13 వేల మేర తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అయితే ఈ వారం ప్రారంభం నుంచి ధరలు తిరిగి పెరుగుతుండటంతో మార్కెట్‌లో మరోసారి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.అందుకే కొనుగోలుదారులు రోజువారీ ధరలను గమనిస్తూ తమ బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మంచిది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird