Home సినిమా హైవేపై బర్త్ డే వేడుకలు.. 8 మంది అరెస్ట్ – Andhra Waves

హైవేపై బర్త్ డే వేడుకలు.. 8 మంది అరెస్ట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
హైవేపై బర్త్ డే వేడుకలు.. 8 మంది అరెస్ట్


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ జాతీయ రహదారిపై ప్రమాదకర స్టంట్లు చేయటంతో పాటు.. కత్తితో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న యువకుల వ్యవహారం తీవ్ర వివాదస్పదంగా మారింది. నేషనల్ హైవే-9 పై కారు బోనెట్‌పై ఐదు కేకులు ఉంచి, ఓ యువకుడు పెద్ద కత్తితో వాటిని కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అక్టోబరు 29వ తేదీన ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. హాపూర్‌లోని ‘రాజా కీ హవేలీ’ హోటల్ సమీపంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

నిందితుడు మొదట తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను సేర్ చేశాడు. ఆ తర్వాత డిలీట్ చేసినప్పటికీ, ఆ వీడియో వైరల్‌గా మారింది. కేక్టింగ్ మాత్రమే కాకుండా, ఆ యువకులు రద్దీగా ఉండే హైవేపై కదులుతున్న కారు కిటికీల నుంచి బయటకు వంగడం, బైక్‌లపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణాలను ముప్పులోకి నెట్టారు. కొత్త ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రజా భద్రతకు భంగం కలిగించిన వీడియోలను సుమోటోగా స్వీకరించినట్లు హాపూర్ ఎస్పీ. అరెస్ట్ అయిన వారిలో ‘హిందూ రక్షా దళ్’ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird