Table of Contents
ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి.. జనాల్లో తిరుగుతూ.. తెలంగాణ ‘గోల్డ్ మ్యాన్’గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. గోల్డ్ మ్యాన్ ఆర్థిక వ్యవహారాలపై ఐటీ శాఖ ఉచ్చు బిగించింది. ఆయన ఆస్తుల చిట్టాను తవ్వుతున్న ఐటీ శాఖకు చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్, హైదరాబాద్ రాయదుర్గంలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనాన్ని, దాని ద్వారా సమకూరుతున్న అద్దె ఆదాయాన్ని తాత్కాలికంగా అటాచ్ (జప్తు) చేసింది. చిన్న గౌడ్ తన బావమరిది యాదగిరి ప్రణయ్ గౌడ్ పేరును అడ్డుపెట్టుకుని, బినామీ రూపంలో ఈ భారీ ఆస్తి కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
ఆదాయం లేకుండానే కోట్ల విలువైన భవనం నిర్మాణం
ప్రణయ్ గౌడ్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులు ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో రెండు చొప్పున డబుల్ బెడ్రూమ్ (2-బీహెచ్‌కే) ఫ్లాట్లను నిర్మించారు. అయితే, 2019లో ఈ కొనుగోలు చేసిన తేదీ నాటికి ప్రణయ్ గౌడ్‌కు పన్ను పరిధిలోకి వచ్చే ఎలాంటి ఆదాయ మార్గాలు లేవని ఐటీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సొంత సంపాదన లేని వ్యక్తి ఇంత ఖరీదైన కొనుగోలు చేసి, భారీ భవనాన్ని ఎలా నిర్మించగలిగారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి.
భూమి కొనుగోలు వెనుక నిధుల మళ్లింపు
2019 జులై 1న జరిగిన సెల్ డీడ్ వివరాల ప్రకారం, శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ నవ్ ఖల్సా గ్రామ పరిధిలో 222 చదరపు గజాల వివరాల రూ. 26.7 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో రూ. 1.7 లక్షలు నగదు రూపంలో చెల్లించగా, మిగిలిన రూ. 25 లక్షలను మూడు బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా బదిలీ చేశారు. ఈ స్థలం కొనుగోలుకు, ఆ తర్వాత భవన నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను తానే సమకూర్చినట్లు విచారణ సందర్భంగా చిన్న గౌడ్ అంగీకరించినట్లు సమాచారం.
అద్దె డబ్బుల మళ్లింపుపై ఐటీ ఆరా
ఈ అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ. 3.2 లక్షల అద్దెకు లీజుకు ఇచ్చారు. భవనంపై ఎలాంటి యాజమాన్య యాజమాన్య హక్కులు లేనప్పటికీ, ఈ అద్దె డబ్బు మొదట చిన్న గౌడ్ భార్య బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆ తర్వాత నగదు చిన్న గౌడ్ ఖాతాల్లోకి మళ్లినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లు స్పష్టం చేస్తున్నాయి. విచారణలో భాగంగా తనకు ప్రతినెలా సుమారు రూ. 1.76 లక్షలు అందుతున్నాయని చిన్న గౌడ్ ఒప్పుకున్నారు. గతంలో ప్రణయ్‌కు ఇచ్చిన అప్పుకు తిరిగి చెల్లింపులుగా ఆ డబ్బు వస్తోందని ఆయన వాదించారు. కానీ, అప్పులు ఇచ్చినట్లు ఎలాంటి అధికారిక పత్రాలు లేవు, పైగా డెవలపర్లకు చెల్లింపులు జరిపినప్పుడు స్వయంగా చిన్న గౌడే రుణం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో ఐటీ అధికారులు ఆయన వాదనను తోసిపుచ్చారు.
బినామీ చట్టం కింద కఠిన చర్యలు
ఈ ఆధారాల ఆధారంగా ప్రణయ్ గౌడ్‌ను ‘బినామీదార్’గా, ఆయన బావ చిన్న గౌడ్‌ను అసలు ‘లబ్ధిదారు’ (బెనిఫిషియల్ ఓనర్)గా గుర్తిస్తూ అధికారులు తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం-1988లోని సెక్షన్ 24(4)(a)(i) కింద జైంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నవంబర్ 17న ఈ జప్తు ఉత్తర్వులకు ఆమోదముద్ర వేశారు. కేసు విచారణ ముగిసే వరకు దర్యాప్తు అధికారి అనుమతి లేకుండా ఈ భవనాన్ని విక్రయించడం లేదా, ఇతరులకు బదిలీ చేయడం లేదా పూర్తిగా నిషేధించబడింది.
గతంలో రూ. కోటి విలువైన బంగారం స్వాధీనం
గత ఏప్రిల్ నెలలో చిన్న గౌడ్ ఆర్థిక వ్యవహారాలపై మొదలైన విచారణకు ఈ తాజా చర్యలు చేపట్టారు. ఏప్రిల్ 3న ఆయన ఇచ్చిన టీవీ, యూట్యూబ్‌లను పరిశీలించిన ఐటీ అధికారులు, ఆదాయపు ఇంటర్వ్యూ పన్ను చట్టం-2025లోని సెక్షన్ 247 కింద ఆయనను విచారించారు. ఆ తనిఖీల్లో ఆయన వద్ద లభించిన 900 గ్రాముల బంగారం, లెక్కల్లో చూపిన 700 గ్రాముల (సుమారు రూ. కోటి) పసిడిని అధికారులు సీజ్ చేశారు. భూ లావాదేవీలు, అద్దెల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని ఆయన చెప్పిన సరైన ఆధారాలు చూపలేకపోయారని, పైగా ఆయన ఐటీ రిటర్నుల్లో వార్షిక ఆదాయం కేవలం రూ. 4 లక్షలుగా మాత్రమే నమోదై ఉందని అధికారులు కలిగి ఉన్నారు.
