సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. అనౌన్స్ అయినప్పటి నుంచే పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అంచనాలను సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. అయితే, రిలీజ్ టైమ్ దగ్గరపడుతున్నా చిత్ర యూనిట్ మాత్రం ఆశించిన స్థాయిలో అప్ డేట్స్ రావడం లేదని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సూపర్ స్టార్ బర్త్ డే రోజు కూడా జక్కన్న కేవలం రుద్ర క్యారెక్టర్‌కు సంబంధించిన స్టిల్స్ మాత్రమే రిలీజ్ చేసి సరిపెట్టారు. దీంతో అభిమానులంతా ఇప్పుడు ఒకే మాట అంటున్నారు.. “మళ్లీ నవంబర్ 15 వస్తోంది జక్కన్న.. కనీసం ఈసారైనా ఒక్క అప్డేట్ వదలచ్చుగా” అని ఆశగా కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ 15న ‘వారణాసి’ టీం సినీ ప్రియులకు గూస్బంప్స్ తెప్పించే ట్రీట్ ఇచ్చింది. పెద్ద స్క్రీన్‌పై గ్రాండ్‌గా విడుదల చేసిన ఆ కాన్సెప్ట్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కానీ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఒక్క బిగ్ అప్డేట్ కూడా రాలేదు. చూస్తుండగానే మళ్లీ నవంబర్ 15వ తేదీ దగ్గరికి వచ్చేసింది. ఏడాది కాలంగా అప్డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా మరో మహేష్ అభిమానులకు ఈ డేట్ ఎమోషన్‌లా మారిపోయింది.
ఈ నవంబర్‌లోనైనా చిత్ర యూనిట్ నుంచి ఏదైనా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని ఇటీవల కొన్ని ఊహాగానాలు వినిపించాయి. కానీ మేకర్స్ వైపు నుంచి ఎలాంటి కదలిక లేకపోవడం ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. ఇప్పటికే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవైపు పోస్ట్‌పోన్ రూమర్స్, మరోవైపు కనీసం చిన్న అప్డేట్ కూడా లేకపోవడంతో ఘట్టమనేని అభిమానులు కాస్త తక్కువగా ఉన్నారు. మరి ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకుని జక్కన్న ఈ నవంబర్ 15న ‘వారణాసి’ నుంచి ఏదైనా సర్ప్రైజ్ వదులుతారో చూడాలి.

