Home సినిమా కిరణ్ అబ్బవరం రికార్డ్: కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.? – Andhra Waves

కిరణ్ అబ్బవరం రికార్డ్: కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


కిరణ్ అబ్బవరం నటిస్తున్న 14వ చిత్రానికి ‘రికార్డ్’ అనే టైటిల్‌ను ప్రకటించారు. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా సినిమా టైటిల్ పోస్టర్ అంటే నటినటుల లుక్ లేదా కథకు సంబంధించిన ఓ చిన్న హింట్ ఇస్తారు. కానీ ఈ పోస్టర్ మాత్రం ఓ కెమెరా వ్యూఫైండర్‌లా కనిపిస్తూ.. అందులోని ప్రతి చిన్న అంశం వెనుక ఏదో మిస్టరీ దాగి ఉందనే భావన కలిగిస్తోంది.

పోస్టర్‌లో కనిపించే కెమెరా ఇంటర్‌ఫేస్‌ను ముందుగా చూస్తే.. కాంతి ఫ్లాష్ గుర్తు, మధ్యలో ఎరుపు రంగు రికార్డింగ్ డాట్‌తో టైమర్, కుడివైపు 4K, 60 వివరాలు కనిపిస్తున్నాయి. కింద SLO-MO, VIDEO, PHOTO, PORTRAIT అనే షూటింగ్ మోడ్స్‌తో పాటు గ్యాలరీ, షట్టర్ ఐకాన్లు ఉన్నాయి.

సినిమా కథలో కెమెరా లేదా రికార్డ్ చేసిన వీడియోలకు ఏదైనా ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతోందా? అనే సందేహం కలుగుతోంది. ఇక ‘RECORD’ టైటిల్‌లోని ఓ అక్షరాన్ని కూడా రికార్డింగ్ బటన్‌లా డిజైన్ చేశారు. కథలో ఏదైనా కీలక సంఘటనను కెమెరాలో బంధించడం, దాని ద్వారా బయటపడే నిజాలు ప్రధాన అంశంగా ఉండవచ్చనే ఊహాగానాలకు ఇది తావిస్తోంది.

ఇక పోస్టర్‌లోని విజువల్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దట్టమైన ఎర్రటి చంద్రుడి ముందు కిరణ్ అబ్బవరం సైడ్ ప్రొఫైల్ షాడో నిర్మించబడింది. సాధారణంగా ఇలాంటి రెడ్ మూన్ విజువల్స్ సినిమాల్లో భయానక వాతావరణం, ఉత్కంఠ, ప్రమాదానికి సంకేతాలుగా ఉపయోగిస్తుంటారు. మరి ఈ సినిమాలోనూ రాత్రి వేళల్లో జరిగే రహస్య సంఘటనలకు ప్రాధాన్యత ఉంటుందా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి: సుకుమార్ శిష్యుడితో కిరణ్ అబ్బవరం.. రికార్డ్ మూవీ గ్రాండ్ లాంచ్.!

కిరణ్ అబ్బవరం వెనుక భాగంలో పూసలు, గంటల అలంకరణతో కనిపిస్తున్న జంతువు(గాడిద) కూడా పోస్టర్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలుగు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అలంకరణలు కొన్ని సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉంటాయి. ఎదురుగా ముఖం అడ్డంగా కనిపిస్తున్న ఆకులు ఎవరో దాక్కుని చూస్తున్నట్లుగా, నిఘా పెడుతున్నట్లుగా ఓ భావనను కలిగిస్తున్నాయి.

కింది ఎడమవైపు కోట బురుజు నిర్మాణం నిర్మించబడింది. దీనితో కథకు ఏదైనా ప్రత్యేకమైన గ్రామీణ లేదా చారిత్రక ప్రాంతంతో సంబంధం ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో కొండారెడ్డి బురుజు నేపథ్యంలో ఈ సినిమా గురించి వార్తలు వచ్చిన సంగతి కూడా ఈ పోస్టర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

ఇక పోస్టర్‌లో మరో చిన్న మార్పు కూడా వచ్చింది. కిరణ్ అబ్బవరం పేరును ‘KIRAN ABBAVARAAM’ అని అదనపు అతో ముద్రించారు. ఇది కేవలం పోస్టర్ డిజైన్‌లో భాగమా? లేక నటుడి పేరులో స్పెల్లింగ్ మార్పు చేసుకున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.

సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి ప్రదర్శించారు. ఈ సినిమాతో వీర కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

మొత్తానికి ‘రికార్డ్’ పోస్టర్‌లో కెమెరా, ఎర్రటి చంద్రుడు, గాడిద, కోట బురుజు.. ఇలా ఒక్కో అంశం ప్రశ్నను లేవనెత్తుతోంది. టైటిల్ పోస్టర్‌తోనే ఇన్ని ప్రశ్నలు రేకెత్తించడం ‘రికార్డ్’కు మంచి ఆసక్తిని తీసుకొచ్చింది.

మీకు నచ్చవచ్చు:
ప్యాక్ టీజర్.. గుర్తింపు ఫ్యామిలీ కథలు వద్దు.. శ్రీ విష్ణు నాన్ స్టాప్ పంచ్‌లు.!
చిరంజీవి పేరులో ‘N’ మాయం.. ఆ హోర్డింగ్స్‌ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా.?

[Kiran Abbavaram, Record Movie, Concept Poster, Decoding]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird