ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామంది ఇయర్‌బడ్స్ వాడుతున్నారు. పాటలు వినడం, సినిమాలు చూడటం, ఫోన్ కాల్స్ మాట్లాడటం కోసం గంటల తరబడి చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టుకుంటున్నారు. అయితే వీటిని అతిగా ఉపయోగించడం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ వాల్యూమ్‌తో ఎక్కువసేపు పాటలు వినడం వల్ల చెవిలోని సున్నితమైన కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. క్రమంగా వినికిడి శక్తి తగ్గిపోవచ్చు. కొందరిలో చెవుల్లో ఈలలు, రింగులు మోగుతున్నట్లు అనిపించే టిన్నిటస్ సమస్య కూడా రావచ్చు. ఈ సమస్యలు కొన్నిసార్లు శాశ్వతంగా మారే ప్రమాదం ఉంది.
అలాగే ఇయర్‌బడ్స్‌ను గంటల తరబడి చెవుల్లో ఉంచుకోవడం వల్ల చెవి లోపల తేమ పేరుకుపోవచ్చు. ముఖ్యంగా చెమట పట్టినప్పుడు, ఇయర్‌బడ్స్ శుభ్రంగా లేనప్పుడు కనిపించడం లేదా ఫంగల్ఫెక్షన్లు వచ్చే అవకాశం పెరుగుతుంది. చెవిలో దురద, నొప్పి, ప్రస్తుతం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇయర్‌బడ్స్ పెట్టుకుని రోడ్లపై నడవడం, వాహనాలు నడపడం కూడా ప్రమాదకరమే. చుట్టుపక్కల వాహనాల హారన్లు, హెచ్చరిక శబ్దాలు వినిపించే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది.
అందుకే ఇయర్‌బడ్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాల్యూమ్‌ను తక్కువగా ఉంచుకోవాలి. సాధారణంగా గరిష్ఠ వాల్యూమ్‌లో 60 శాతం మించకుండా వినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సురక్షితమైన వినికిడి సమయం శబ్ద తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. మధ్యమధ్యలో చెవులకు విశ్రాంతి ఇవ్వాలి. ఇయర్‌బడ్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ముఖ్యంగా చెవుల్లో నొప్పి, శబ్దాలు వినిపించడం, వినికిడి తగ్గడం వంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయకుండా కనిపిస్తే ఈ’టీ సూచనలను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
