Home తెలంగాణ మహబూబాబాద్ సుష్మిత కేసు: 18 పేజీల లేఖ.. ప్రేమ, పెళ్లి, కు – Andhra Waves

మహబూబాబాద్ సుష్మిత కేసు: 18 పేజీల లేఖ.. ప్రేమ, పెళ్లి, కు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Mahabubabad Sushmita Case:తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న సుస్మిత అనే యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువతి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా తీవ్రమైన విషాదాన్ని నింపింది. పోలీసు ఉద్యోగాన్ని సాధించి.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కలలుగన్న సుస్మిత.. చివరకు విగత జీవిగా మారింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకో ఈ దారుణం జరిగింది […]

మహబూబాబాద్ సుస్మిత కేసు:తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న సుస్మిత అనే యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువతి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా తీవ్రమైన విషాదాన్ని నింపింది. పోలీసు ఉద్యోగాన్ని సాధించి.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కలలుగన్న సుస్మిత.. చివరకు విగత జీవిగా మారింది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకో ఈ దారుణం ప్రాథమికంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో అందరిని ఆశ్చర్యపరుస్తున్న అంశం ఆమె రాసిన 18 పేజీల లేఖ. ఇందులో ఆమె తన జీవితంలో ఎదురైన పరిస్థితులు.. ప్రేమ వ్యవహారం.. పెళ్లి విషయంలో ఎదురైన పరిణామాలను వివరించింది.

ఎవరు ఈ సుస్మిత

మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామానికి చెందిన మునిగే కుమారస్వామి.. సుకన్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో సుస్మిత పెద్ద కుమార్తె. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఆమె కష్టపడుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. మహబూబాబాద్‌లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఈ గ్రామం లో ఆమెకు అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు.

సుస్మిత అనిల్ మధ్య దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. పెళ్లి చేసుకోవాలని కూడా ఇద్దరు అనుకున్నారు. వివాహం గురించి సుస్మిత ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అనిల్ దాటవేశాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అనేకమార్లు సుస్మిత అడిగినప్పటికీ అనిల్ ఈ విషయంలో నిరాసక్తత వ్యక్తం చేయడంతో ఆమె తీవ్రమైన మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలోనే 18 పేజీల లేఖ రాసింది. అనిల్ తో.. తన జీవితంలో ఎదురైన పరిస్థితులు.. పెళ్లి విషయంలో చోటుచేసుకున్న సమస్యలను అందులో ఆమె ప్రస్తావించింది.

తన మరణానికి అనిల్ ని బాధ్యుడిగా ఆమె చేసింది. నవంబర్ 12న సుస్మిత ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ కోరుకున్న సుస్మిత రాసిన 18 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనిల్.. అతడి తల్లిదండ్రులు.. గ్రామ సర్పంచ్.. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు. కేవలం కులం అనే కారణాలు చూపిస్తూ సుస్మితను అనిల్ పెళ్లి చేసుకోలేదని.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird