Home Latest News భక్తుల కొంగుబంగారం: కాశీపట్నం ట్రీ టెంపుల్.. నాలుగు శతాబ్దాల పురాతన ఆలయం.! | ట్రీ టెంపుల్ | విశాఖపట్నం | అరకు మార్గం | రామలింగేశ్వరస్వామి | బ్రహ్మసూత్రలింగం – Andhra Waves

భక్తుల కొంగుబంగారం: కాశీపట్నం ట్రీ టెంపుల్.. నాలుగు శతాబ్దాల పురాతన ఆలయం.! | ట్రీ టెంపుల్ | విశాఖపట్నం | అరకు మార్గం | రామలింగేశ్వరస్వామి | బ్రహ్మసూత్రలింగం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విశాఖపట్నం నుంచి అరకు వైపు వెళ్లే మార్గంలో ఉన్న కాశీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అనేక ప్రత్యేకతలతో సందర్శకులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రకృతి సౌందర్యాల నడుమ ఈ పురాతన క్షేత్రంలో భారీ మర్రి, రావి చెట్ల వేర్లు, ఊడల తొర్రలో శివలింగ రూపం కనిపించడం ఆధ్యాత్మిక విశేషంగా నిలుస్తోంది. కార్తీక మాసంలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి పునీతులౌతారు. సుమారు నాలుగు శతాబ్దాల ప్రాచీనత కలిగిన ఈ దేవాలయాలు సాధారణ ఆలయాలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మర్రి, రావి వృక్షాల ఊడలు, తొర్రల నడుమ స్వామివారి దర్శనం భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

ఇక్కడి శివలింగాన్ని బ్రహ్మసూత్ర లింగం కావడం ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత. ఆలయ నిర్మాణ శైలి కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. చిన్న ఇటుకులతో పిరమిడ్ ఆకారంలో పైకి నిర్మించిన పురాతన కట్టడం నాటి నిర్మాణ విశిష్ఠతను కళ్లకు కడుతుంది. ఆలయ లోపలి భాగంలోనూ ఊడలు వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే శివాలయాలలో సాధారణంగా కనిపించే నందీశ్వరుడికి భిన్నంగా, ఇక్కడ నందీశ్వరుడు స్వయంభూగా వెలిసినట్లు, నేల లోపలి నుంచి స్వామివారి చూస్తున్నట్లుగా కనిపించడం విశేషం. ఈ పరిసరాలన్నీ పచ్చదనంతో నిండి ఉంటాయి.

ఈ దేవాలయానికి సమీపంలోనే నది ప్రవహిస్తుండగా, ఇటీవల రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో నీటి ప్రవాహం పెరిగింది. గత ఏడాదితో ఈసారి నీరు అధికంగా రావడంతో పాటు బురద నీరు ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు నదిలో స్నానమాచరించేవారు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక జారీ చేశారు. అది పక్కన పెడితే.. ఈ ఆలయం నిత్యం దీపారాధనలు, భక్తుల పూజలతో అలరారుతుంటుంది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ప్రకృతి ఒడిలో దైవత్వాన్ని దర్శించుకునే అవకాశం ఈ ఆలయ ప్రత్యేకత,. చుట్టుపక్కల కొండలు, నది సాన్నిహిత్యం కలగలిసిన ఈ ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయతను ఇష్టపడే వారికి ప్రత్యేక గమ్యస్థానంగా నిలుస్తోంది. కార్తీక మాసంతో పాటు ఇతర పర్వదినాలు, మహాశివరాత్రి వంటి సందర్భాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భక్తుల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు.

ఇది కూడా చదవండి: కార్తీక మాసం ఎన్ని రోజులు, ముఖ్యమైన పండుగల క్యాలెండర్

నది ప్రవాహం, కొండ ప్రాంతాల నేపథ్యంలో సందర్శకులు జాగ్రత్తలు పాటిస్తూ దర్శనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మొత్తంగా విశాఖ అరకు మార్గంలోని కాశీపట్నం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తన పురాతన కట్టడం, చెట్టు తొర్రలో శివలింగం, స్వయంభూ నందీశ్వరుడు, ప్రకృతి అందాలతో భక్తులు, పర్యాటకుల ఆసక్తి నిలుపుతోంది. ఈ క్షేత్ర సౌకర్యాలు, రవాణా, పర్యాటక పరంగా మరింత గుర్తింపు పొందాలంటే ఆకాంక్ష సందర్శకుల్లో వ్యక్తమవుతోంది.

మీకు నచ్చవచ్చు: శివకేశవులకు, ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం, పూజా విధానం.

ఆధ్యాత్మిక సౌరభం.. కార్తిక మాసం

[TreeTemple, Visakhapatnam, Araku Route, RamalingeswaraSwamy, BrahmasutraLingam, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird