
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విమర్శ విడుదలపై వైసీపీ అధినేత జగన్‌లకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. బడ్జెట్ లెక్కలు, చెల్లింపుల విధానంపై జగన్ కు కనీస అవగాహన కూడా లేదని ఆయన మాటల ద్వారా వెల్లడైంది. నిధులు విడుదల చేసే త్రైమాసికానికి (పేమెంట్ క్వార్టర్), ఆ నిధులు వర్తించే విద్యా సంవత్సరానికి (అకడమిక్ ఇయర్) మధ్య ఉన్న తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడేందుకు ఎద్దేవా చేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీంతో విద్యార్థులు తమ సొంత డబ్బుతో ఫీజులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా నిధులను నేరుగా కళాశాలకే జమ చేస్తోందని లోకేశ్ వివరించారు. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేశారు. ప్రతి నెలా నిరంతరాయంగా 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తున్నామని.. మిగిలిన బకాయిల పోటీ దశలవారీగా చెల్లుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని జగన్‌కు హితవు పలికారు.
మంత్రి విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, జూన్ 2024 నాటికి మానవ వనరుల శాఖలో 3 వేల 828 కోట్ల బకాయిలు ఉండగా, జూన్ 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 4 వేల 962.22 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. విద్యా సంవత్సరాల వారీగా చూస్తే 2023–24 సంవత్సరం వరకు రూ.193.02 కోట్లు, 2024–25 విద్యా సంవత్సరానికి రూ.3,060.48 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరానికి రూ.1,708.72 కోట్లు విడుదలయ్యాయి.

అలాగే ఆర్థిక సంవత్సరాల వారీగా 2024–25లో రూ.1,451.38 కోట్లు, 2025–26లో రూ.1,665.21 కోట్లు, 2026–27లో రూ.1,845.63 కోట్లు విడుదలయ్యాయి. కార్పొరేషన్ల వారీగా నిధుల పంపిణీ చేసిన వివరాలను కూడా ఫ్యాక్ట్ షీట్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.2,09.01 కోట్లు, ఎస్సీ3 కార్పొరేషన్ ద్వారా రూ.1,042.29 కోట్లు, ఓసీ విభాగం రూ.1,042.28 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.283.61 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.220.02 కోట్లు పంపిణీ అయ్యాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో జాతీయ సగటును మించి అక్షరాస్యులు.. లోకేష్.!
ఈ మాటన్నీ విద్యా రంగానికి ఇచ్చిన నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం కళాశాలల నిర్వహణ, విద్యార్థుల ఉన్నత విద్య కొనసాగింపుతో ముడిపడి ఉన్న కీలక అంశం కావడంతో జగన్ విమర్శలకు లోకేష్ ఇచ్చిన కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
.webp)
రానున్న నెలల్లో ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 కోట్ల మేర బకాయిల చెల్లింపులు ఏ విధంగా కొనసాగుతాయో, పెండింగ్ నిధుల క్లియరెన్స్ ఎంత వేగంగా పూర్తవుతుందో చూడాలి. విద్యా సంవత్సరం, ఆర్థిక సంవత్సరం లెక్కల మధ్య సమన్వయంతో నిధులు సకాలంలో అందిన కొత్త కళాశాలలకు ఊరట లభిస్తుందని అంటున్నారు. మొత్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లోకేశ్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ఈ వివాదానికి సంబంధించిన ప్రభుత్వ లెక్కలను ప్రజల ముందు ఉంచింది. మిగిలిన బకాయిలను త్వరగా తీర్చి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలంటే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది.
మీకు నచ్చవచ్చు: వెయ్యి పాఠశాలలకు 5-స్టార్ హోదా.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు.!
విద్యాహక్కు చట్టం.. భారీగా పెరిగిన అడ్మిషన్లు.. మండలిలో లోకేష్.!
[AndhraPradesh, Fee Reimbursement, Nara Lokesh, YS Jagan, Fact Sheet, TeluguOne]
