జిమ్‌లో ప్రమాదాలు జరగటం ప్రాణాలు కోల్పోవటం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వెయిట్లు మీద పడి ప్రాణాలు పోగొట్టుకునేవారే ఉంటారు. మరి కొంతమంది గుండెపోటు కారణంగా మరణిస్తారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ చాలా భయంకరమైన ప్రమాదం సంభవించింది. కిటికీ దగ్గర ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేస్తున్న ఓ యువతి అదుపుతప్పింది. కిటికీలోంచి కిందపడిపోయింది. దీంతో ఆమె ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగింది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ యువతి మూడో అంతస్తులోని జిమ్ ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతోంది. ట్రెడ్ మిల్ పక్కనే అద్దాల కిటికీ తెరిచి ఉంది. వేగంగా రన్నింగ్ చేస్తున్న ఆమె అకస్మాత్తుగా పట్టుతప్పింది. ఆ వెంటనే ట్రెడ్మిల్కు పక్కనే ఉన్న కిటికీలోంచి కిందకు జారిపడింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన జిమ్ సిబ్బంది, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె మృతి చెందింది.
ఈ ప్రమాదం మొత్తం అక్కడి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ”జిమ్‌లలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కంటే ప్రాణం ముఖ్యం కదా”..”అయ్యో పాపం.. ఎంత దారుణం జరిగిపోయింది”..”జిమ్ యాజమాన్యం చేసిన తప్పుకు నిండు ప్రాణం బలైంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎన్ ఇండోనేషియా, ఉనా ముజెర్ డి 22 అనోస్ పెర్డియో లా విడా అల్ పెర్డర్ ఎల్ ఎక్విలిబ్రియో మైంట్రాస్ హసియా ఎజెర్సిసియో ఎన్ యునా సింటా డి కొర్రర్ వై కేర్ పోర్ లా వెంటానా డెల్ టెర్సర్ పిసో క్యూ టెనియా డెట్రాస్.
ఎసా ఇమేజ్ ఇన్క్రెయిబుల్… https://t.co/4T6nIdknD4
— Marcrix Noticias (@MarcrixNoticias) నవంబర్ 15, 2026
The post జిమ్‌లో పెను విషాదం appeared first on iDreamPost.

ఎన్ ఇండోనేషియా, ఉనా ముజెర్ డి 22 అనోస్ పెర్డియో లా విడా అల్ పెర్డర్ ఎల్ ఎక్విలిబ్రియో మైంట్రాస్ హసియా ఎజెర్సిసియో ఎన్ యునా సింటా డి కొర్రర్ వై కేర్ పోర్ లా వెంటానా డెల్ టెర్సర్ పిసో క్యూ టెనియా డెట్రాస్.