రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రణబలి’ బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగుతోంది. మొదటి వీకెండ్‌లో మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా అత్యంత కీలకమైన సోమవారం రోజున వర్కింగ్ డే టెస్ట్‌లోనూ అద్భుతమైన నిలకడను ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. ఆన్‌లైన్‌లో గంట గంటకు టికెట్ బుకింగ్స్ పెరుగుతూ పోతున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గడచిన ఒక్క గంటలోనే ఏకంగా 8.53 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
వీకెండ్ ముగిసిన ప్రేక్షకులు థియేటర్ల వైపు భారీగా అడుగులు వేస్తారు కొత్త వీక్ డేస్‌లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. నాలుగో రోజు వసూళ్లతో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.
కాగా, ఆదివారం రోజున తెలుగు రాష్ట్రాలనుంచి అత్యధికంగా 7.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటకలో 1.05 కోట్లు, తమిళనాడులో 20 లక్షలు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో 25 లక్షల చొప్పున గ్రాస్ కలెక్ట్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 426 షోలకు గానూ 56.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వైజాగ్లో 71 శాతం, విజయవాడలో 74 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.

