
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే కథ, యాక్షన్‌తో పాటు డ్యాన్సులకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా తనదైన గ్రేస్‌తో స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించడం ఆయన ప్రత్యేకత.
ఇప్పుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాలోనూ అలాంటి ఓ స్పెషల్ ట్రీట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ఓ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. చిరంజీవి, రితికా సింగ్ కలిసి ఈ పాటల్లో స్టెప్పులు వేసినట్లు కనిపిస్తున్నాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు, తమన్ అదిరిపోయే మాస్ బీట్ కంపోజ్ చేసినట్లు సమాచారం.

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లోని ‘బాస్ పార్టీ’ పాట ఎంతగా పాపులర్ అయిందో తెలుస్తుంది. ఆ పాటలో ఊర్వశి రౌతేల సందడి చేశారు. ఇప్పుడు ‘కాకా’లో రితికా సింగ్‌తో చిరంజీవి చేసే డ్యాన్స్ నంబర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఇది కూడా చదవండి: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, ప్రభాస్.. సందీప్ రెడ్డి అభిమానం చూపిస్తాడా.?
ఇక ‘కాకా’ విషయానికి వస్తే.. చిరంజీవి రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల జారీ.
మీకు నచ్చవచ్చు:
ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి సహా తరలివచ్చిన ప్రముఖులు.!
ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.!
[Kaaka Special Song, Ritika Singh, Chiranjeevi, Bobby Kolli, Thaman]
