Home జాతీయం జర్నలిజం ఎథిక్స్: నిష్పాక్షికం అనేది జర్నలిజంలో లేదు.. – Andhra Waves

జర్నలిజం ఎథిక్స్: నిష్పాక్షికం అనేది జర్నలిజంలో లేదు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Journalism Ethics: నేడు పత్రికా దినోత్సవం. ఈసందర్భంగా పత్రికల గురించి కొన్ని నిజాలు చెప్పుకోవాలి. సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక అధినేత గోయంక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు.. ఇతర సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ సమయంలో ఆ పత్రికలో పనిచేసే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. ఇంతవరకు బాగానే ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లో పనిచేసే పెద్ద తలకాయలో ఒక అనుమానం.. ఏం చేయాలి.. పేపర్లో ఎలా వేయాలి. ఈ […]

Journalism Ethics: నేడు పత్రికా దినోత్సవం. ఈసందర్భంగా పత్రికల గురించి కొన్ని నిజాలు చెప్పుకోవాలి. సరిగ్గా కొన్ని దశాబ్దాల క్రితం.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక అధినేత గోయంక ఇంట్లో పెళ్లి జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు.. ఇతర సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ సమయంలో ఆ పత్రికలో పనిచేసే ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. ఇంతవరకు బాగానే ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లో పనిచేసే పెద్ద తలకాయలో ఒక అనుమానం.. ఏం చేయాలి.. పేపర్లో ఎలా వేయాలి. ఈ నిర్వహణ నిర్వహణను ఎలా అడగాలి.. అనేక తర్జనభజనలు పడిన తర్వాత ఒక కీలక ఉద్యోగి ధైర్యం తెచ్చుకొని గోయంకాను సంప్రదించారు. ఆ ఉద్యోగి అలా ధైర్యం చేయడానికి వెనుక కారణం ఉంది. ఎందుకంటే ఇప్పటికే న్యూస్ పేపర్ ప్రింట్ డెడ్ లైన్ దగ్గర పడుతుంది. చివరికి గోయంకను అడిగితే.. ఆయన గట్టిగా నవ్వేశారు. ఆ తర్వాత నా ఇంట్లో పెళ్లి దేశ ప్రజలకు వార్త ఎందుకు అవుతుందని ప్రశ్నించారు.

ఇప్పుడు గోయాంక లాంటి పెద్ద మనుషులు లేరు. అటువంటి విలువలు కూడా ఇప్పుడు లేవు. చాలామంది మీడియా అధినేతలు తాము నిజాలకు కట్టుబడి ఉన్నామని.. దమ్మున్న జర్నలిజం చేస్తున్నామని.. సత్యమేవ జయతే అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నామని చెబుతుంటారు. కానీ అవేవి నిజం కాదు. ఎందుకంటే మీడియా అధినేతల ఇజాలు నిజాలను ఎప్పటికీ తొక్కేస్తూనే ఉంటాయి. నిష్పక్షి కథ అనేది జర్నలిజం లోనే ఉండదు.

ఒకవేళ పైకి చెప్పేవన్నీ కూడా జర్నలిజం లో ఉండి ఉంటే.. మీడియా రంగంలో పని చేసే వారి జీతాలు.. జీవితాలు బాగుపడేవి. కొంతమంది మాత్రమే పైకి ఎదుగుతున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటికీ మీడియా రంగంలో పనిచేస్తున్న 99.9 శాతం మందికి సరైన వార్త రాయడం రాదు. సరైన వార్త చెప్పడం రాదు. అక్కడిదాకా ఎందుకు జర్నలిజం ప్రమాణాలలో ఒక్క శాతం కూడా వారికి ఇంప్లిమెంట్ చేయడం చేతకాదు.

తెలుగులో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా దాదాపుగా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక సంస్థకు బాకా ఊదుతున్న వ్యవస్థలే. ఒకప్పుడు తన వార్త ఎందుకని రామోజీరావు ప్రశ్నించారు.. తనకు సంబంధించిన ఏ సంఘటనను కూడా ఈనాడు పత్రిక లేదా ఈనాడు ఛానల్ లో చూపించేవారు కాదు. ఆ తర్వాత రామోజీరావు గురించి ప్రస్తావన లేకుండా.. రామోజీరావు ఇంట్లో జరిగే శుభకార్యాల తంతు కవరేజ్ లేకుండా ఈనాడు పేపర్ ని చూడగలమా. ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ కొత్త భవనంలోకి అడుగుపెడితే.. అది మెయిన్ పేజీలో సెకండ్ బ్యానర్ అయింది. ఇక సాక్షిలో జగన్ గురించి భజన వేరే లెవెల్ లో ఉంటుంది. నమస్తే లో కేసీఆర్ కుటుంబం గురించి కీర్తనలు అంతకుమించిన స్థాయిలో ఉంటాయి.

పై స్థాయి తలకాలను మేనేజ్మెంట్లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి వారంతా కూడా జర్నలిజం లో విలువల గురించి మాట్లాడుతుంటారు. అక్షర సమరం.. అక్షర సేద్యం.. విలువలు.. నీతి అనే మాటలు మాట్లాడుతుంటారు. నిజంగానే ఆ స్థాయిలో విలువలను పాటిస్తే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీవితాలు అలా ఎందుకు ఉంటాయి. జీతాల కోసం రోడ్లమీద ధర్నా చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది. తెలుగు మీడియా రంగంలో వెజ్ బోర్డు ఎన్ని అమలు చేసే సంస్థలు ఎన్ని.. ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రమే కోరుకునే సంస్థలు.. ఆ మధ్య ఓ పత్రికలో పనిచేసే ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో చనిపోతే మేనేజ్‌మెంట్ రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి ఉద్యోగులే తలా ఇంత వేసుకొని బతికించుకోవలసిన పరిస్థితి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మీడియా అధినేతలు సర్వ పరిత్యాగులు కాదు. గొప్పవాళ్లు అంతకంటే కాదు. అక్షరాలను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకొని వ్యాపారం చేసే వ్యక్తులు మాత్రమే.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird