Home సినిమా బావోలి ఆర్ట్ సంగంలో చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి.. భారతీయ కళలు, వారసత్వ పరిరక్షణకు కృషి! – Andhra Waves

బావోలి ఆర్ట్ సంగంలో చైర్‌పర్సన్‌గా అల్లు స్నేహారెడ్డి.. భారతీయ కళలు, వారసత్వ పరిరక్షణకు కృషి! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


భారతదేశంలో తొలిసారిగా స్టెప్‌వెల్ ఆర్ట్ బినాలే ‘బావోలి ఆర్ట్ సంగం’లో అల్లు స్నేహారెడ్డి కీలక బాధ్యతలు చేపట్టారు. ఆమె కల్చర్ అండ్ హెరిటేజ్ విభాగం చైర్పర్సన్‌గా నియమితులయ్యారు.

ఫ్యాషన్, కళలు, సంస్కృతిపై ప్రత్యేక ఆసక్తి కలిగిన అల్లు స్నేహారెడ్డి ఈ కార్యక్రమంలో భాగం కావడం విశేషం. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని మరింత మందికి చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

భారతదేశంలోని చారిత్రక మెట్ల బావుల (స్టెప్వెల్స్) విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు, వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, చారిత్రక ప్రాధాన్యత, నీరు, కళలు, నాగరికత మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో స్నేహారెడ్డి భాగస్వామ్యం భారతీయ కళా వారసత్వంపై మరింత అవగాహన పెంచడంతో పాటు, మన సంస్కృతిని గౌరవించేలా ప్రజలను ప్రోత్సహించనుంది.

బావోలి ఆర్ట్ సంగం 2026 డిసెంబర్ 1 నుంచి 2027 జనవరి 10 వరకు జరగనుంది. ఈ వేడుకలో భారతీయ కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

[Allu Sneha Reddy, Baoli Art Sangam, Stepwell Art Biennale, India, Heritage]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird