
కొన్ని సినిమాలు చూస్తే నవ్వొస్తుంది. సంబంధిత సినిమాలు చూస్తే ఉత్కంఠ కలుగుతుంది. ఇంకొన్ని మాత్రం మన జీవితంలో మర్చిపోయిన మనుషులను, బంధాలను గుర్తుచేస్తూ మనసును కదిలిస్తాయి. అలాంటి ఓ అరుదైన చిత్రమే ‘పైర్’ (పైర్).
65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఓ వృద్ధ దంపతులు.. 28 ఏళ్లుగా తిరిగిరాని కొడుకు.. చుట్టూ మనుషులే లేని ఓ కొండ గ్రామం.. చివరికి తమ మరణం తర్వాత అంత్యక్రియలు చేసేవాళ్లు కూడా ఉండరేమోనన్న భయం. వినడానికి చిన్న కథలా అనిపించినా, ఇందులో దాగున్న భావోద్వేగం మాత్రం గుండెను బరువెక్కిస్తుంది.
ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామం ఈ సినిమా నేపథ్యం. పదం సింగ్, తులసీ అనే వృద్ధ దంపతులు అక్కడ నివసిస్తుంటారు. దాదాపు 65 ఏళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంటకు ఒక కొడుకు. ఉపాధి కోసం ముంబై వెళ్లిన అతడు 28 ఏళ్లుగా తిరిగి రాలేదు. అయినా ఎప్పటికైనా కొడుకు వస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉంటారు.

ఓ రోజు కొడుకు నుంచి ఉత్తరం వస్తుంది. తాను ఊరికి వస్తున్నానని అందులో సమాచారం ఉంటుంది. దీంతో ఆ వృద్ధ దంపతుల ఆనందానికి అవధులుండవు. కానీ మరోవైపు ఆ గ్రామం మాత్రం రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఉపాధి కోసం ఒక్కొక్కరుగా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉన్న గ్రామం ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: ‘మాతృభూమి’ ట్రైలర్.. తెలంగాణ రియల్ హీరో బయోపిక్‌లో సల్మాన్ ఖాన్.!
ఈ గ్రామం నుంచి వెళ్లిపోతున్న ఓ కుటుంబం ఆ వృద్ధుడితో చెప్పే మాటలు ఎంతో కలచివేస్తాయి. మీరు కూడా త్వరగా ఈ ఊరు విడిచి వెళ్లిపోండి.. లేదంటే మేము వెళ్లిపోయేలోపే చనిపోండి.. మీరు చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా ఇక్కడ నలుగురు మనుషులు ఉండరనే అర్థం వస్తుంది. ఆ మాటల్లోని కఠినత్వం వెనుక గ్రామాలు వలసల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపించారు దర్శకుడు.
ఈ సినిమాలో అత్యంత భావోద్వేగమైన అంశాల్లో ఒకటి పదం సింగ్ తన ఇంటి బయటే రెండు చితిమంటల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో సాయం చేసేవాళ్లు ఎవరూ మిగలరని భావించి, తన భార్య కోసం.. మరొకటి తన కోసం సిద్ధం చేసుకుంటాడు. అది చూసిన తుల్సీ ప్రశ్నించగా, తాను ముందుగా చనిపోతే ఆమెను కొండ కిందకు ఎవరు తీసుకెళ్తారని ఆలోచిస్తున్నానని చెబుతాడు.

65 ఏళ్ల దాంపత్యం తర్వాత కూడా తనకంటే భార్య గురించే ఎక్కువగా ఆలోచించే భర్త. ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు, విహారయాత్రలు మాత్రమే కాదని.. ఒకరికొకరు తోడుగా ఉండటం, కష్టాలు అందించడం, చివరి క్షణం వరకు ఒకరి గురించి మరొకరు ఆలోచించడమేనని ఈ కథ గుర్తుచేస్తుంది.
దర్శకుడు వినోద్ కప్రికి ఈ సినిమా ఆలోచన 2018లో వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని మున్సియారి ప్రాంతంలో ఓ వృద్ధ దంపతుల గురించి తెలుసుకున్న ఆయన, వారి జీవితంలో ఒంటరితనం, ఒకరిపై మరొకరికి ఉన్న ఆధారాన్ని కథగా మలచాలనుకున్నారు. మొదట నిజ జీవితంలో ఆ దంపతులతోనే సినిమా చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు.
చివరికి పదం సింగ్ కప్రి, హీరా దేవిలను ప్రధాన పాత్రల కోసం ఎంపిక చేశారు. వీరిద్దరూ అంతకుముందు కెమెరా ముందు నటించిన అనుభవం లేని గ్రామీణులు. అయినప్పటికీ తెరపై వారి సహజమైన నటన ప్రధానమైనది. పదం సింగ్ కప్రి దర్శకుడు వినోద్ కప్రికి చిన్నాన్న కావడం మరో విశేషం.

‘పైర్’ 2024లో టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకుంది. అక్కడ బెస్ట్ ఫిల్మ్ ఆడియన్స్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. భారతదేశంలో అక్టోబర్ 30, 2026న థియేటర్లలో విడుదలైంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఈ సినిమా రెండు కోట్లు రాబట్టడం విశేషం. ‘రామాయణ’ రాకపోయి ఉంటే.. లాంగ్ రన్ లో వండర్స్ క్రియేట్ చేసి ఉండేదేమో.
ఇక తాజాగా ఈ సినిమా 99వ అకాడమీ అవార్డుల కోసం జనరల్ ఎంట్రీ కేటగిరీల్లో సమర్పించేందుకు దర్శకుడు వినోద్ కప్రి నిర్ణయించుకున్నారు. స్వతంత్రంగా రూపొందించిన ఈ చిన్న సినిమా అంతర్జాతీయంగా ఇంతటి గుర్తింపు పొందడం విశేషం.
‘పైర్’ కథ ఉత్తరాఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో సాగినా, అందులో చూపించిన సమస్య మనకు కూడా కొత్తేమీ కాదు. ఉద్యోగాలు, మెరుగైన జీవితం కోసం పిల్లలు నగరాలకు, విదేశాలకు వెళ్లడం సహజమే. కానీ వారి కోసం ఎదురుచూస్తూ పల్లెల్లో ఒంటరిగా మిగిలిపోయే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? డబ్బులు పంపించవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు పక్కన కూర్చునే మనిషిని, నాలుగు మాటలు మాట్లాడితే ఆత్మీయతను డబ్బుతో కొనలేం కదా.
అందుకే ‘పైర్’ కేవలం ఓ వృద్ధ దంపతుల ప్రేమకథ మాత్రమే కాదు. మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసే సినిమా.
మీకు నచ్చవచ్చు:
30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?
‘గాడ్ ఆఫ్ వార్’కి బ్రేక్.. చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా.!
[Pyre Movie, Emotional Story, Vinod Kapri, Padam Singh Kapri, Heera Devi]
