Home సినిమా టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని తెలుసా? – iDreamPost – Andhra Waves

టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని తెలుసా? – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని తెలుసా? - iDreamPost


కూరగాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది, వాటిని ఉంచడానికి ఫ్రిజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఫ్రిజ్ అన్ని రకాల కూరగాయలను పెట్టడం సరైన పద్ధతి కాదు. కొన్ని రకాల కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి విషంగా మారే అవకాశం ఉంది. కూరగాయలు పోషక విలువలను కోల్పోతాయి. మనం ప్రతీ రోజూ వంటల్లో వాడే టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టడం అస్సలు మంచిది కాదని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టమాటలలో వాటికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది, సువాసనను ఇచ్చే కొన్ని రకాల ఎంజైములు, అస్థిర సమ్మేళనాలు. టమాటాలను ఫ్రిజ్‌లోని చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు, ఆ ఎంముల పనితీరు ఆగిపోతుంది. దీనివల్ల టమాట తన సహజమైన రుచిని, సువాసనను కోల్పోయి చప్పగా మారుతుంది. అంతేకాదు.. ఫ్రిజ్‌లోని చల్లటి గాలి వల్ల టమాట లోపల ఉండే కణ్ణ గోడలు దెబ్బతింటాయి. దీనివల్ల టమాట గట్టిదనాన్ని కోల్పోయి, లోపల మెత్తగా, పిండిపిండిగా మారిపోతుంది.

అలాంటి టమాటాలను కూరల్లో వాడినా అవి సరిగ్గా ఉడకవు, ముక్కలు కూడా త్వరగా కరగవు. టమాటాలలో ‘లైకోపీన్’ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, టమాటాలను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల వాటిలోని పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్ల శాతం తగ్గుతుందని పలు పరిశోధనల్లో నిరూపితమైంది.

టమాటాలను ఇలా భద్రపరచండి..

టమాటాలను ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద, గాలి ఆడే బుట్టలలో లేదా ఓపెన్ ప్లేస్‌లో ఉంచాలి. టమాటాలను నిల్వ చేసేటప్పుడు వాటి తొడిమ భాగం కిందకు ఉండేలా పెట్టాలి. దీనివల్ల లోపలి తేమ త్వరగా ఆవిరి కాకుండా ఉంటుంది. నుండి టమాటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వంటగదిలో నేరుగా ఎండపడే చోట కాకుండా, కొంచెం నీడగా, చల్లగా ఉండే ప్రదేశంలో టమాలను ఉంచడం మంచిది. టమాటాలు బాగా పండిపోయి, ఫ్రిజ్‌లో పెట్టక తప్పని పరిస్థితి వస్తే.. కనీసం ఒక గంట ముందే ఫ్రిజ్ నుంచి బయటకు తీసి ఉంచాలి. దీనివల్ల అవి మళ్లీ సాధారణ స్థాయికు చేరుకుని కొంతవరకు రుచిని పొందుతాయి.

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird