Table of Contents
పదో తరగతి పాస్ అయిన వారి దగ్గర నుంచి పీజీలు పూర్తి చేసిన వారి వరకు చాలా మంది ఎదురు చూసేది ప్రభుత్వ ఉద్యోగం కోసమే. మీరు కూడా ఇదే జాబితాలో ఉంటే.. ఈ నోటిఫికేషన్ మీకోసమే. పది నుంచి పీజీ అర్హతతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పైగా ఈ ఉద్యోగాలు మన హైదాబాద్ లోనే.
హైదరాబాద్ రాజేంద్రనగర్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో నేషనల్ ఇన్ డిగ్రీ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా గ్రూప్ ‘ఏ’, ‘బీ’, ‘సీ’ విభాగాల్లో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్, లైబ్రరీ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, కేర్‌టేకర్, మల్టి టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) డైరెక్టర్ పోస్టులు ఇందులో ఉన్నాయి.
పోస్టును బట్టి 10వ తరగతి నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమీషన్ మ్యాట్రిక్స్ ప్రకారం నెలకు రూ.18,000 నుంచి రూ.1,77,500 వరకు వేతనం అందుతుంది.
ఖాళీలు, వేతన వివరాలు
పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య7వ వేతన సంఘం పే స్కెల్ వివరాలు:
పోస్టు పేరు ఖాళీలు నెవారి వేతనం
- అసిస్టెంట్ డైరెక్టర్ 1 రూ. 56,100 – రూ. 1,77,500
- లైబ్రరీ అండ్ పబ్లికేషన్ ఆఫీసర్ 1 రూ. 44,900 – రూ. 1,42,400
- అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ 1 రూ. 44,900 – రూ. 1,42,400
- కేర్టేకర్ 1 రూ. 35,400 – రూ. 1,12,400
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 రూ. 18,000 – రూ. 56,900
పోస్టుల వారిగా విద్యార్హతలు
అసిస్టెంట్ డైరెక్టర్: జువాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎంటమాలజీ లేదా సంబంధిత కనీసం సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ (PG) ఉండాలి.
లైబ్రరీ అండ్ పబ్లికేషన్ ఆఫీసర్: లైబ్రరీ సైన్సెస్‌లో కనీసం సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్: కామర్స్ లేదా ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (B.Com/BBA) లేదా సీఏ ఇంటర్ / సీఎంఏ ఇంటర్ / పూర్తిస్థాయి CA/CMA అర్హత ఉండాలి.
కేర్టేకర్: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ (BE/B.Tech) లేదా సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేయాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 10వ తరగతి (ఎస్సెస్సీ) లేదా దానికి సమానమైన విద్యార్హతతో పాటు శారీరక దృఢత్వం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ డైరెక్టర్, లైబ్రరీ, ఫైనాన్స్ ఆఫీసర్: రాత పరీక్ష, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్, ముఖాముఖి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
కేర్టేకర్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ శారీరక సామర్థ్య పరీక్ష ద్వారా ఎంపిక పూర్తి చేస్తారు.
దరఖాస్తు రుసుము
- గ్రూప్ ‘ఏ, ‘బీ’ పోస్టులకు: రూ. 590
- గ్రూప్ ‘సీ’ పోస్టులకు: రూ. 295
మినహాయింపు: ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) లేదా ఆన్‌లైన్ విధానంలో చెల్లించవచ్చు.
దరఖాస్తు సమర్పించే విధానం
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది:
- ఎన్ఐపీహెచ్ఎం అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ఫారమ్‌లో వివరాలను నింపి, విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులను జత చేయాలి.
- కవరుపై దరఖాస్తు చేస్తున్న “పోస్టు పేరు, ప్రకటన సంఖ్య” స్పష్టంగా రాయాలి.
- స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా క్రింది చిరునామాకు దరఖాస్తు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
- రిజిస్ట్రార్,
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM),
- రాజేంద్రనగర్, హైదరాబాద్ – 500030, తెలంగాణ.
The post పది పాస్ అయితే..1.77 లక్షల జీతంతో appeared first on iDreamPost.
