సీఎం విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, ఆయన స్నేహితురాలు, స్టార్ హీరోయిన్ త్రిష కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ పొలిటికల్ ప్రస్థానంలో త్రిష పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు, రానున్న జనవరిలో అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. విజయ్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో, అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో టీవీకే తరపున త్రిషను బరిలోకి దించుతారంటూ గతంలోనే తమిళ మీడియా వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆ తర్వాత రాఘవ లారెన్స్ పేరు తెరపైకి రావడం, న్యాయపరమైన అంశాలతో ఉప ఎన్నిక చర్చలు కాస్త నెమ్మదించినప్పటికీ, త్రిష రాజకీయ అరంగేట్రంపై సందేహాలు మాత్రం సమసిపోలేదు.
The post విజయ్ పార్టీలోకి త్రిష? నిజమేనా! iDreamPostలో మొదట కనిపించారు.
