మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓ కావ్య మారన్ల పెళ్లి వేడుకకు రంగం సిద్ధమైంది. నవంబర్ 10న గ్రీస్ వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాల సభ్యులు పయనమయ్యారు. వివాహ వేడుకకు సమయం దగ్గర పడటంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వీఐపీలతో సందడిగా మారింది. ఈ రాయల్ వెడ్డింగ్‌కు హాజరయ్యేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్ విమానం ఎక్కారు. బిజినెస్ క్లాస్ క్యాబిన్లో ఫ్లైట్ సిబ్బందితో రజినీ దిగిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ వద్ద ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. వీరంతా ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా గ్రీస్ చేరుకుంటున్నారని, నవంబర్ 10, 11 తేదీల్లో జరిగే వివాహ వేడుకలు ముగించుకుని నవంబర్ 13న చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. అతిథుల రాకపోకలు, వసతి ఏర్పాట్లన్నీ మారన్ కుటుంబమే దగ్గరుండి చూస్తోంది.రజనీకి కొడుకు.. స్టాలిన్‌కి మేనకోడలు
ఈ వివాహం సినీ, వ్యాపార రంగాల కలయిక రాజకీయంగా నిలుస్తోంది. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర.. రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకోవడంతో, అనిరుధ్ స్వయానా రజనీకి కొడుకు వరుస అవుతారు. అటు కావ్య మారన్.. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తె. కరుణానిధి కుటుంబంతో ఉన్న బంధుత్వం రీత్యా ఎంకే స్టాలిన్ కావ్యకు మేనమామ వరుస అవుతారు. ఇలా ఇరువైపులా ఉన్న బలమైన రక్తసంబంధాల కారణంగా ఈ పెళ్లి వేడుకకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నవంబర్ 21న మెగా రిసెప్షన్
గ్రీస్ తీరంలో నవంబర్ 10, 11 తేదీల్లో అత్యంత సన్నిహితులు, కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. అనంతరం చెన్నై వేదికగా నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎ.రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులకు కళానిధి మారన్ దంపతులు స్వయంగా ఆహ్వాన పత్రికలు ఏర్పాటు చేశారు. ఈ మెగా రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌తో పాటు సినిమా, క్రికెట్, రాజకీయ రంగాల దిగ్గజాలు హాజరుకానున్నారని తెలుస్తోంది.
