కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి మహీంద్రా కంపెనీ శుభవార్త చెప్పింది. నవంబర్ 2026లో తన పలు మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ మహీంద్రా XUV 3XO కొనుగోలుపై గరిష్ఠంగా రూ.60,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది. ఇందులో రూ.40,000 వరకు క్యాష్‌కౌంట్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఏ వేరియంట్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందనేది డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు.
డిజైన్‌లో స్పోర్టీ లుక్
మహీంద్రా XUV 3XO చూడటానికి స్పోర్టీగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ముందుభాగంలో ప్రత్యేకమైన గ్రిల్, C-ఆకారంలో ఉండే డీఆర్ఎల్‌లు, LED హెడ్‌లైట్లు SUVకి బలమైన లుక్ ఇస్తాయి. వెనుకవైపు కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు ఆధునిక రూపాన్ని అందిస్తాయి. ఇక క్యాబిన్‌లో 10.25 టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సాఫ్ట్‌టచ్ డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో సెగ్మెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పనోరమిక్ సన్‌రూఫ్ కూడా అందించారు. దీనితో ప్రయాణ సమయంలో క్యాబిన్ మరింత ప్రీమియంగా అనిపిస్తుంది.
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్
కారు కొన మైలేజీ, ఫీచర్లతో పాటు భద్రతకు కూడా చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో మహీంద్రా XUV 3XO మంచి ఎంపికగా నిలుస్తోంది. ఈ ఎస్యూవీకి భారత్ NCAP క్రాష్ స్టాల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), పిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, లెవల్ 2 ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో మరింత భద్రతకు తోడ్పడతాయి.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు
మహీంద్రా XUV 3XOలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రెండు రకాలుగా లభిస్తుంది. TCMPFi, mStallion TGDi ఇంజిన్‌లు మంచి పికప్, పర్ఫామెన్స్ అందిస్తాయి. వీటితో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. నగర ప్రయాణాలతో పాటు వేలపై వస్తువులేవారికి పెట్రోల్ ఇంజన్లు బాగా ఉపయోగపడతాయి. ఎక్కువ దూరం ఉంటే వారికి డీజిల్ వేరియ మరో ఎంపికగా ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ మోడళ్లలో లీటరుకు సుమారు 18 నుంచి 20 వరకు, డీజిల్ వేరియంట్లలో 20 నుంచి 21.2 వరకు వస్తుందని సమాచారం. అయితే వాస్తవ మైలేజీ డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మారుతుంది.
రూ.7.79 లక్షల నుంచి ప్రారంభ ధర
ధర విషయంలోనూ మహీంద్రా XUV 3XO తన పక్కన పోటీగా నిలుస్తోంది. ఈ ఎస్యూ ఎక్స్‌షోరూమ్ ధరలు సుమారు రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.15.04 లక్షల వరకు ఉన్నాయి. వేరియంట్, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌ను బట్టి ధర మారుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డిస్‌ప్లే, ఆధునిక భద్రతా ఫీచర్లు కావాలనుకునేవారికి టాప్ వేరియంట్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే తక్కువ బడ్జెట్‌లో ఎస్యూవీ కొనాలనుకునేవారు బేస్, మిడ్ వేరియంట్లను కూడా పరిశీలించవచ్చు.
కొనాలనుకుంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి
నవంబర్ 2026లో మహీంద్రా XUV 3XOపై గరిష్ఠంగా రూ.60,000 వరకు ప్రయోజనాలు ప్రకటించడం కొనుగోలుదారులకు మంచి అవకాశం. ఇందులో రూ.40,000 వరకు క్యాష్‌కౌంట్‌తో పాటు ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ప్రతి వేరియంట్‌కు ఒకేలా వర్తిస్తుందని చెప్పలేం. నగరం, డీలర్‌షిప్, వాహనం తయారీ నెల, అక్కడ ఉన్న స్టాక్ ఆధారంగా ఆఫర్‌లు మారే అవకాశం ఉంది.
