మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. మరోవైపు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ కాంపౌండ్‌లోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నట్లు ఫిలిం లో గుసగుసలు మొదలయ్యాయి.
మైత్రీ మూవీ మేకర్స్‌తో సినిమా కోసం దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుస పాన్ – ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న మైత్రీ బ్యానర్లో దుల్కర్ సినిమా అంటే.. హైప్ మామూలుగా ఉండదు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
గతంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’, రీసెంట్ ‘సీన్’ లాంటి సెన్సేషనల్స్తో సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ జిత్తు మాధవన్‌తో దుల్కర్ ఓ సినిమా చేయడం ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు హీరోయిన్గా ఎంపికైనట్లు టాక్. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ టేకప్ చేయబోయేది ఈ క్రేజీ కాంబోనేనా? లేదా దుల్కర్‌తో మైత్రీ టీమ్ ఏదైనా కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమా తెరపైకి తెస్తోందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ ప్రాజెక్ట్‌కే మైత్రీ నిర్మాతలుగా మారితే మాత్రం సౌత్‌లోనే క్రేజీయెస్ట్ కాంబినేషన్‌గా నిలవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి మైత్రీ నిర్మాణంలో దుల్కర్ సినిమా చేస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.
The post మైత్రీ కాంపౌండ్‌లోకి దుల్కర్..? iDreamPostలో మొదట కనిపించారు.
