Table of Contents
చాలా మందికి ఫ్రిజ్‌లో ఎలాంటి వస్తువులు పెట్టాలో కనీస అవగాహన లేదు. ఫ్రిజ్‌లో ఖాళీ ఉంది కదా అని అన్ని రకాల కూరగాయలు, ఇతర ఆహార పదార్ధాలు పెట్టేస్తుంటారు. ఫ్రిజ్‌లో ఉంచటం వల్ల పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయని భావిస్తారు. అయితే, కొన్ని రకాల కూరగాయలు, ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే పాడవుతాయి. కొన్ని సార్లు సహజ రుచిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
టమాటాలు
టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచితే వాటి సహజమైన రుచి, ఆకృతి దెబ్బతింటాయి. చల్లటి గృహాల వల్ల వాటితో ఉండే కణ త్వచాలు దెబ్బతిని, అవి మెత్తగా మారిపోతాయి. వీటిని ఎల్లప్పుడూ గది వద్దే ఉంచాలి.
ఉల్లిపాయలు, వెల్లుల్లి
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే అందులోని తేమ కారణంగా అవి త్వరగా మెత్తబడి, బూజు పట్టే అవకాశం ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రిజ్ చల్లదనానికి మొలకలు రావడం లేదా కుళ్లిపోవటం జరుగుతుంది. వీటిని పొడిగా, గాలి ఆడే ప్రదేశాల్లో ఉంచడమే ఉత్తమం.
బంగాళదుంపలు
బంగాళాదుంపలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. అందులో ఉండే స్టార్చ్ కాస్త వేగంగా చక్కెరగా మారుతుంది. దీనివల్ల వాటి రుచి దెబ్బతినడమే కాకుండా, ఉడికించినప్పుడు లేదా వేయించినప్పుడు అవి నల్లగా మారుతాయి. వీటిని పేపర్ బ్యాగ్‌లలో ఉంచి చీకటి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయటం ఉత్తమం.
తేనె
తేనెను ఫ్రిజ్‌లో పెడితే అది గడ్డకట్టుకుపోయి పంచదార పాకంలా మారిపోతుంది. తేనె సహజంగానే ఎక్కువ కాలం పాడవకుండా ఉండే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని గది వద్ద నార్మల్ డబ్బాలో ఉంచితే సరిపోతుంది.
బ్రెడ్
చాలామంది బ్రెడ్ ఎక్కువ రోజులు రావాలని ఫ్రిజ్‌లో పెడతారు. కానీ, చల్లటి వేడి వల్ల బ్రెడ్ త్వరగా ఎండిపోతుంది. అంతేకాదు, గట్టిగా కూడా మారుతుంది. బ్రెడ్‌ను కొన్న రెండు నుంచి మూడు రోజుల్లోనే వాడేయడం మంచిది.
అరటిపండ్లు
అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి తొక్క త్వరగా నల్లగా మారిపోతుంది. అదనంగా, చల్లదనం వల్ల ఇవి పక్వానికి వచ్చే ప్రక్రియ ఆగిపోతుంది. లోపల సరిగ్గా పండవు.
కాఫీ పొడి
కాఫీ పొడి లేదా కాఫీ గింజలను ఫ్రిజ్‌లో పెడితే, అది ఫ్రిజ్‌లోని తేమను, ఇతర ఆహార పదార్థాల వాసనలను పీల్చుకుంటుంది. దీనివల్ల కాఫీ యొక్క అసలు సువాసన, రుచి పూర్తిగా పోతుంది. అందుకే, కాఫీ పొడిని ఎయిర్ టైట్ కంటార్‌లో బయటే ఉంచాలి.
