Home సినిమా ఒకే మూడు సినిమాలు: సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.? – Andhra Waves

ఒకే మూడు సినిమాలు: సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


ఒక సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు కేటాయించడం ఇప్పుడు స్టార్ హీరోలకు కామన్ అయిపోయింది. పాన్ ఇండియా సినిమా అనే పేరుతో షూటింగ్ మొదలుపెట్టిన దగ్గరి నుంచి రిలీజ్ వరకు చాలా సమయం తీసుకుంటున్నారు. కానీ కోలీవుడ్ స్టార్ సూర్య మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వెళ్తున్నారు. ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా ఒకే తరహా కథలతో కాదు.. మూడు విభిన్న జానర్స్‌లో మూడు డిఫరెంట్ పాత్రలతో.

2026లో సూర్య నుంచి ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ‘సీన్’ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ మూడు సినిమాలను గమనిస్తే సూర్య ఎంపిక కథల్లో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది.

ముందుగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ విషయానికి వస్తే.. ఇది కమర్షియల్ ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్. ఫాంటసీ, భక్తి, సామాజిక అంశాలు కలిపి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు.

ఇక రెండో సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సూర్య ఒక మధ్యవయస్కుడైన వ్యక్తిగా కనిపించగా.. మమితా బైజు ఆయనకు జోడీగా నటించారు. ఏజ్ గ్యాప్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.200కి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇది కూడా చదవండి: సీన్ మూవీ రివ్యూ!

ఇక ఇప్పుడు ‘సీన్’తో మరో కొత్త ప్రయోగం చేశారు సూర్య. మలయాళంలో ‘ఆవేశం’ వంటి విభిన్నమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రలు పోషించారు. సీరియస్ క్రైమ్ చుట్టూ సాగే కథలో కామెడీని మిక్స్ చేస్తూ దర్శకుడు మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు.

ఇలా ఏడాదిలో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్టైనర్, న్యూ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ కామెడీ.. ఇలా మూడు విభిన్న జానర్స్‌లో సూర్య ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మన స్టార్ హీరోల గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మన స్టార్స్ ఒక్కో రెండేళ్లు, మూడేళ్లు కేటాయిస్తున్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల పేరుతో సినిమాల నిర్మాణ సమయం పెరుగుతోంది. దీంతో అభిమానులు తమ అభిమాన నటుడి సినిమాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

పాన్ ఇండియా సినిమా చేయడం తప్పు కాదు. భారీ స్థాయిలో సినిమాలు నిర్వహించడం కూడా అవసరమే. కానీ అదే సమయంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, చాలా వేగంగా సినిమాలు చేస్తే బాగుంటుందని తెలుగు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సూర్య లాగా ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలు చేయకపోయినా.. కనీసం రెగ్యులర్‌గా సినిమాలు విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుంటారు.

మరి సూర్య చూపిస్తున్న ఈ స్పీడ్, జానర్ వైవిధ్యాన్ని మన తెలుగు స్టార్స్ కూడా ఫాలో అవుతారా? లేక పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఎక్కువ సమయం కేటాయిస్తారా? అన్నది చూడాలి.

మీకు నచ్చవచ్చు:
‘రాకా’ షాకింగ్ అప్‌డేట్.. 2025లో షూటింగ్ స్టార్ట్.. ఇంకా సగం కూడా పూర్తి కాలేదా.?
తొలి భారతీయ నటుడిగా విజయ్‌ సేతుపతి రికార్డు.. ఇంటర్నేషనల్‌ వేదికపై అరుదైన అవకాశం!

[Suriya Three Movies in One Year, Suriya 2026 Movies, Karuppu Movie, Vishwanath & Sons, Scene Movie, Telugu Star Heroes, Pan India Movies, Suriya Latest Movies, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird