Home Latest News ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.! | కియా ఇండియా పెట్టుబడి అనంతపురం | ఆంధ్రప్రదేశ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ | పెట్టుబడి | ఏపీ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నం – Andhra Waves

ఏపీలో కియా విస్తరణ: 14 వేల 167 కోట్ల పెట్టుబడి: విశాఖ ఇన్వెస్టర్ల సదస్సులో ఎంవోయూ.! | కియా ఇండియా పెట్టుబడి అనంతపురం | ఆంధ్రప్రదేశ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ | పెట్టుబడి | ఏపీ ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖపట్నం – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ లోకి ఇండియా విస్తరణకు రంగం సిద్ధమైంది. కియా ఏపీలో భారీగా తన ప్లాంట్‌ను విస్తరించడానికి 1.5 బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు 14 వేల 167 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టింది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఆటోమొబైల్ రంగానికి ఊతమివ్వనుంది.

ప్రస్తుతం అనంతపురంలో ఉన్న కియా తయారీ కేంద్రానికి ఏటా 3 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే, ఈ తాజా పెట్టుబడి ద్వారా ప్లాంట్ ఉత్పత్తిని మరింత భారీగా పెంచాలని కియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ పూర్తయితే అనంతపురం ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 లక్షల వాహనాలకు చేరుకుంటుందని అంచనా.

ఈ పెట్టుబడి కేవలం ఉత్పత్తి పెంచడానికే కాకుండా, ప్లాంట్‌లో సరికొత్త ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కొత్త మోడల్స్‌ను తీసుకురావడంతోపాటు, వివిధ రకాల పవర్‌ట్రెయిన్‌ల కాంబినేషన్‌తో కూడిన నూతన వాహనాలను కొనుగోలు చేయడం అందుబాటులోకి తీసుకురావడానికి కియా లక్ష్యంగా చెబుతున్నారు. అలాగే స్థానిక సప్లయర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా వృద్ధికి బలమైన బాటలు వేయాలని కంపెనీ భావిస్తోంది.

విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఈ విస్తరణ ప్రణాళికకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే ఈ ఇన్వెస్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా యాజమాన్యం ఎంవోయూ కుదుర్చుకో జరిగింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతున్న అవసరాలను తీర్చడంలో ఈ పెట్టుబడి కీలక పాత్ర పోషిస్తుందని కియా చెబుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. రష్యా వేదికగా నారా లోకేష్!

అనంతపురం ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన నాటి నుంచి కియా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ అదనపు పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఏపీ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఆటోమొబైల్ రంగానికి ఈ పెట్టుబడి ఒక మైలురాయిగా నిలవాలని, వేలాది మందికి ఉపాధి లభించనున్న పరిశ్రమలకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు: పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 2.!

రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ.!


[Kia India investment Anantapur, Andhra Pradesh Manufacturing Plant, Investment, AP Investor Summit Visakhapatnam, Telugu One]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird