Home జాతీయం ISRO: అంతరిక్షంలో మన నావిక్ ఎలా పనిచేస్తుందంటే.. – Andhra Waves

ISRO: అంతరిక్షంలో మన నావిక్ ఎలా పనిచేస్తుందంటే.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ISRO: చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. చేతిలో టార్చ్ లైట్ ఉంది. కాకపోతే అది పరాయి వాళ్ళది. మనం చీకట్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు పరాయి వాళ్ళ టార్చ్ లైట్ అడిగితే ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇస్తారు. ఎక్కువసార్లు ఇవ్వరు కదా. పైగా చీకట్లో ప్రయాణం చేయక తప్పదు. అలాంటప్పుడు సొంతంగా టార్చ్ లైట్ సమకూర్చుకోవడమే ఉత్తమం. సరిగ్గా ఇదే పని ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేసింది. ఇంతకీ ఈ ప్రయోగం వెనుక […]

ఇస్రో: చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నాం. చేతిలో టార్చ్ లైట్ ఉంది. కాకపోతే అది పరాయి వాళ్ళది. మనం చీకట్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు పరాయి వాళ్ళ టార్చ్ లైట్ అడిగితే ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇస్తారు. ఎక్కువసార్లు ఇవ్వరు కదా. పైగా చీకట్లో ప్రయాణం చేయక తప్పదు. అలాంటప్పుడు సొంతంగా టార్చ్ లైట్ సమకూర్చుకోవడమే ఉత్తమం. సరిగ్గా ఇదే పని ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేసింది. ఇంతకీ ఈ ప్రయోగం వెనుక కథ ఏంటంటే..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అత్యంత సగర్వంగా చేపట్టిన GSLV – F 18 రాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. రోదసీలో మన దిక్సూచి వ్యవస్థను బరోపేతం కోసం సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌లో NVS -03 మూడవది.. దీనిని నావిక్ 3 అని పిలుస్తున్నారు.

శ్రీహరికోటలో రెండవ ప్రయోగ వేదిక నుంచి NVS 03 శుక్రవారం రాత్రి 11 గంటల యాభై ఒక్క నిమిషానికి నింగిలోకి చేరింది. GSLV -F 18 రాకెట్ నుంచి NVS 03 శాటిలైట్ ను నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. అత్యంత సులువుగా తన మూడు దశలను పూర్తి చేసింది. సుమారు 2250 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని 20 నిమిషాల్లోనే కక్ష్యలోకి విడిచింది. దీనికంటే ముందు గురువారం రాత్రి 11:50 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైంది. 24 గంటలపాటు ఇది సాగింది. ఆ తర్వాత GSLV -F 18 రోదసిలోకి దూసుకుపోయింది.

రాకెట్ గమనం శాస్త్రవేత్తల డిజైన్ ఆధారంగానే సాగింది. గమ్యాన్ని చేరుకున్న అనంతరం SVS -03 ఉపగ్రహాన్ని భూ స్థిర బదిలీ కక్ష్య (జీటీవో)లోకి ప్రవేశపెట్టింది. శాటిలైట్ లోకి చేరిన అనంతరం స్థిరంగా ఉంది. బెంగళూరులో ఉన్న హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ స్టేషన్ కు సిగ్నల్స్ లభించాయి.. దీని ద్వారా కచ్చితంగా నావిగేషన్ సేవలు మన దేశ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

GSLV F 18 రాకెట్ ఎత్తు 50 మీటర్లు, బరువు 420 టన్నులు. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో చేశారు. ఉపగ్రహానికి NVS -03 అని పేరు పెట్టారు. ఉపగ్రహం పరుగు 2250 కిలోలు.. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి ఈ ప్రయోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నావిక్ సేవలను నిరంతరంగా అందించడానికి.. రక్షణ రంగాన్ని అత్యంత బలోపేతం చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. తద్వారా మన దేశ అంతర్గత వ్యవస్థలు.. నావిగేషన్ వ్యవస్థ పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird