Home జాతీయం NavIC: అమెరికా జీపీఎస్ తో పనిలేదు.. భారత్ సాధించిన ‘నావిక్’ అద్భుతం.. మన రక్షణ ఎంత పటిష్టమంటే? – Andhra Waves

NavIC: అమెరికా జీపీఎస్ తో పనిలేదు.. భారత్ సాధించిన ‘నావిక్’ అద్భుతం.. మన రక్షణ ఎంత పటిష్టమంటే? – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


NavIC: ఇప్పటివరకు మనకంటూ సొంత నావిక్ వ్యవస్థ లేదు. పైగా జిపిఎస్ కోసం అమెరికా మీద ఆధార పడాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశం అనేక రకాల సవాళ్లు ఎదుర్కొనేది. అయితే ఇకపై ఆ సమస్య లేదు. ఎందుకంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. చాలా కాలం పాటు ఈ ప్రయోగం చేయాలి అనుకుంటున్నప్పటికీ.. చివరికి ప్రయోగం ఫలించింది. మనదేశ అంతరిక్ష రంగంలో సరికొత్త మైలురాయి సాధ్యమైంది. సొంతంగా నావిక్ వ్యవస్థ కోసం […]

NavIC: ఇప్పటివరకు మనకంటూ సొంత నావిక్ వ్యవస్థ లేదు. పైగా జిపిఎస్ కోసం అమెరికా మీద ఆధార పడాల్సి వస్తుంది. దీనివల్ల మన దేశం అనేక రకాల సవాళ్లు ఎదుర్కొనేది. అయితే ఇకపై ఆ సమస్య లేదు. ఎందుకంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. చాలా కాలం పాటు ఈ ప్రయోగం చేయాలి అనుకుంటున్నప్పటికీ.. చివరికి ప్రయోగం ఫలించింది. మనదేశ అంతరిక్ష రంగంలో సరికొత్త మైలురాయి సాధ్యమైంది.

సొంతంగా నావిక్ వ్యవస్థ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV -F 18 రాకెట్ ద్వారా NVS -03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతమైంది.. అయితే ఈ ప్రయోగం విజయవంతం కావడం ఒక్కరోజులో సాధ్యం కాలేదు. దీని వెనక ఇస్రో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. సరిగ్గా 2025లో జనవరిలో NVS -02 ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. దీనితో ఇస్రో మీద అనేక రకాలుగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే నాడు ఆ ప్రయాగంలో కనెక్టర్ విఫలమైంది. దీనిని అధిగమించేందుకు NVS -03 శాటిలైట్ ను బెంగళూరులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించిన స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో రూపొందించారు. ఇందులో ఇండియన్ మేడ్ రూబీడియం అటామిక్ క్లాక్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఎల్ 1, ఎల్ 5, ఎస్ బ్యాండ్ తో సంకేతాలు ప్రసారమవుతాయి.

భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ సేవలను కొనసాగించేందుకు NVS-03 శాటిలైట్ పనిచేస్తుంది.. మన దేశ భౌగోళిక పరిధి.. సరిహద్దు అవతల 1500 పరిధి వరకు ఇది కవర్ చేస్తుంది. అమెరికాకు చెందిన GPS, రష్యాకు సంబంధించిన గ్లోనాస్, యూరప్ కు చెందిన గెలీలియో, చైనాలోని బీడో నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థలు ప్రపంచాన్ని మొత్తం కవర్ చేస్తున్నాయి. ఇక నావిక్ అనేది మన ప్రాంతం మీద ఇండిపెండెంట్ గా పనిచేసే నావిగేషన్ వ్యవస్థ. ఇది పూర్తిగా మనదేశ పరిధిలో ఉంటుంది. సరిగా 2006లో దీనికి నాటి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2013లో ఈ వ్యవస్థ కోసం 2250 కోట్లు కేటాయించింది. ఇక శ్రీహరికోటలో ఇప్పటివరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 11 నావిగేషన్ శాటిలైట్స్ ను ప్రయోగించింది. ఇప్పుడు ఆ సంఖ్య ఈ ప్రయోగంతో 12 కు చేరుకుంది. అయితే వీటిలో కొన్ని అనుకున్న దిశలో వెళ్లక.. విఫలమయ్యాయి.

మొదట్లో నావిక్ ను ఏకంగా 7 ఉపగ్రహాలతో కలిసి పని చేసే విధంగా రూపొందించారు. అయితే ప్రస్తుతం IRNSS 1B, IRNSS -1I, NVS -01 ఉపగ్రహాలు మాత్రమే సిగ్నల్ అందిస్తున్నాయి. అయితే ప్రైమరీ పొజిషన్ సర్వీస్ కాక్ష్య లో కనీసం నాలుగు క్రియాశీలమైన శాటిలైట్స్ అవసరం.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird