Home సినిమా హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ దందా.. – Andhra Waves

హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ దందా.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
హైదరాబాద్ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ దందా..


హైదరాబాద్‌లో మరో సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గర్ల్స్ హాస్టల్ పేరుతో యువతుల అందాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బేగంపేట ప్రాంతంలో ఈ వ్యవహారం బయటపడింది. అండాలను సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.

హైదరాబాద్‌లోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉన్న నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో సుమారు ఏడాది కాలంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. అయితే ఈ హాస్టల్‌లో యువతుల అండాలను సేకరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ దాడులు చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ తనిఖీల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 10 మంది యువతులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.హాటల్‌లో ఉంటున్న యువతుల నుంచి అండాలను సేకరించి సమీపంలోని సంతాన సాఫల్య కేంద్రాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.అయితే ఈ అండాల సేకరణకు యువత స్వచ్ఛందంగా అంగీకరిస్తున్నారా? వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? అందాల సేకరణకు సంబంధించిన నిబంధనలు పాటించారా? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. కేవలం యువతుల అందాల సేకరణ మాత్రమే కాకుండా పురుషుల వీర్యకణాల సరఫరాకు కూడా ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వివిధ ఫెర్టిలిటీ కేంద్రాలతో ఈ ముఠాకు సంబంధాలు ఉన్నాయా? అక్కడి నుంచి ఎవరికైనా అందాలు, వీర్యకణాలు సరఫరా చేస్తున్నారా? అనే వివరాలను యువత విచారిస్తున్నారు.ప్రస్తుతం విచారిస్తున్న పోలీసులు, ఫెర్టిలిటీ కేంద్రాలతో ఉన్న సంబంధాలను కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రచయిత అవతార్

శ్వేత

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird