Home సినిమా సెన్సార్ బోర్డులో కలకలం: 500 సినిమాల డేటా లీక్.! – Andhra Waves

సెన్సార్ బోర్డులో కలకలం: 500 సినిమాల డేటా లీక్.! – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


సినిమా విడుదలకు ముందే కథలోని కీలక విషయాలు బయటకు వస్తే.. మేకర్స్‌కు ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే స్క్రిప్టులు, షూటింగ్ వివరాలను గోప్యంగా ఉంచేందుకు నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఇప్పుడు సినిమాలకు సర్టిఫికెట్లు ఇచ్చే సెన్సార్ బోర్డు దగ్గరే కీలక సమాచారం బయటకు వచ్చినట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 500కు పైగా సినిమాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాల సర్టిఫికేషన్ ప్రక్రియ కోసం ‘ఈ-సినీప్రామాణ్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను ఉపయోగిస్తోంది. నిర్మాతలు తమ సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన పత్రాలను ఈ పోర్టల్‌లో సమర్పిస్తారు.

అయితే, ఈ పోర్టల్‌లోని భద్రతా లోపం 500కు పైగా సినిమా టైటిళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. వీటిలో స్క్రిప్టులు, సెన్సార్ కట్ ఆర్డర్లు, ఇతర సర్టిఫికేషన్ రికార్డులు, కీలక పత్రాలు షూటింగ్ సమాచారం. ఈ ఫైళ్లు మొత్తం ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉన్న నివేదికలు ఉన్నాయి. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో మరో ఆందోళనకరమైన అంశం.. కొన్ని సినిమాలకు సంబంధించిన పంపిణీ ఒప్పందాలు కూడా బయటపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి వివరాలు బయటకు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగే వ్యాపార చర్చలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు విచారణ చేపట్టింది. పోర్టల్ భద్రతను పరిశీలించేందుకు సెక్యూరిటీ ఆడిట్ కూడా ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో చిన్న సమాచారం లీక్ అయినా.. సినిమా ప్రచారంపై, ప్రేక్షకుల ఆసక్తిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార ఒప్పందాలు బయటపడితే నిర్మాతలు, పంపిణీదారులకు అదనపు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

మొత్తానికి, 500కు పైగా సినిమాలకు సంబంధించిన పత్రాలు బయటపడినట్లు వస్తున్న వార్తలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ఘటనకు అసలు కారణమేంటి? ఏయే సినిమాలపై ప్రభావం పడింది? అనే విషయాలు ఇంకా తేలాల్సి ఉంది. CBFC విచారణ, సెక్యూరిటీ ఆడిట్‌లో బయటపడింది ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి 5 రెట్లు పెద్ద సినిమా.. కానీ 40 రోజులు ముందే.!

[Censor Board 500 Films Data Leak, CBFC Data Leak, 500 Movies Scripts Leak, CBFC Security Breach, e-Cinepramaan Portal, Film Certification Records, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird