ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్. కంపెనీ కొత్త ఆపిల్ ఐప్యాడ్ మినీ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. ఇందులో 8.5 ఇంచుల OLED డిస్ప్లే, A20 ప్రో ప్రాసెసర్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. చిన్న సైజులో పవర్ ఫుల్ ట్యాబ్లెట్ కావాలనుకునేవారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. Wi-Fi మోడల్ ప్రారంభ ధర రూ.82,900 కాగా, వైఫై + సెల్యూలర్ మోడల్ ధర రూ.1,00,900గా నిర్ణయించారు. అక్టోబర్ 28 ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. నవంబర్ 6 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.
8.5 ఇంచుల OLED స్క్రీన్
ఈ ఐప్యాడ్ మినీలో 2,316 x 1,512 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కూడిన సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఇచ్చారు. ఇది 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఫోటోలు, వీడియోలు, సినిమాలు చూడటంతో పాటు డిజైన్ పనులు వారికి ఈ స్క్రీన్ ఉపయోగపడుతుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నటువంటి స్క్రీన్‌పై ప్రతిబింబాలు తగ్గించే ఎంపిక చేసిన మోడళ్లలో నానో-టెక్చర్ డిస్ప్లే ఆప్షన్ కూడా ఉంది. ట్యాబ్లెట్ మందం కేవలం 5.4 మిల్లీమీటర్లు. మిడ్ నైట్, స్టార్ లైట్ రంగుల్లో లభిస్తుంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్ కూడా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఫ్లిప్‌కార్ట్ మరో సెల్‌తో వస్తోంది
A20 Pro చిప్‌తో AI పనులు మరింత వేగంగా
కొత్త ఐప్యాడ్ మినీలో A20 Pro చిప్‌ను ఉపయోగించారు. ఇందులో 7-కోర్ జీపీయూ గేతో గ్రాఫిక్స్ పనులు, వీడియో ఎడిటింగ్ వంటి అవసరాలకు మెరుగైన పనితీరును అందించారు. గత తరం మోడల్‌తో తాజా AI పనుల్లో 4.5 రెట్లు, గ్రాఫిక్స్ పనుల్లో 2.7 రెట్లు వేగం పెరిగింది. ఈ ట్యాబ్లెట్ iPadOS 27పై పనిచేస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరీ ఐఐ ఫీచర్లకు సపోర్ట్ ఉంది. అయితే రియల్ టైం వినియోగంలో పర్ఫామెన్స్ యాప్, పని పద్ధతిని బట్టి మారవచ్చు.
కెమెరా, సౌండ్లోనూ కొత్త మార్పులు
వీడియో కాల్స్ కోసం ముందు వైపు 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఇచ్చారు. వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో మరో ప్రత్యేకత అకౌస్టిక్ డిస్ ప్లే సిస్టమ్. స్క్రీన్‌తో అనుసంధానమైన సౌండ్ టెక్నాలజీ ద్వారా ఆడియో అనుభవాన్ని మెరుగుపరిచేలా దీన్ని రూపొందించారు. Wi-Fi 7, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ 6 కూడా ఉన్నాయి. ఆపిల్ పెన్సిల్ ప్రో, ఆపిల్ పెన్సిల్ (USB-C)కి ఈ ట్యాబ్లెట్ సపోర్ట్ ఇస్తుంది. నోట్స్ రాయడం, బొమ్మలు గీయడం, డాక్యుమెంట్లపై పని చేయడం వంటి అవసరాలకు స్టైలస్ ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: అంత కాస్ట్లీ ఫోన్ మరీ ఇంత చీపా ?
బ్యాటరీ, స్టోరేజ్, ధరలు
ఈ ట్యాబ్లెట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుందని ఆపిల్ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. స్టోరేజ్ ఎంపికలు 128GB, 256GB, 512GB. 128GB Wi-Fi మోడల్ ధర రూ.82,900, 256GB మోడల్ ధర రూ.94,90, 512GB మోడల్ ధర రూ.1,18,900 నుంచి. Wi-Fi + సెల్యూలర్ 128GB వేరియంట్ ధర రూ.1,00,900. అదనపు స్టోరేజ్ లేదా సెల్యులార్ కనెక్టివిటీ కావాలంటే ధర పెరుగుతుంది. ప్రీ-ఆర్డర్ చేయడానికి ముందు ఆపిల్ అధికారిక వెబ్సైట్లో వేరియంట్, ధర, అందుబాటులో ఉన్న ఆఫర్లను పరిశీలించడం మంచిది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
