Home Latest News కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా..ఈ నిజాలు తెలుసుకోండి..! | కాఫీ లేదా టీకి ముందు నీళ్లు తాగాలా vknow the Facts | టీ లేదా కాఫీకి ముందు నీరు త్రాగడం మీకు మంచిదేనా? – Andhra Waves

కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా..ఈ నిజాలు తెలుసుకోండి..! | కాఫీ లేదా టీకి ముందు నీళ్లు తాగాలా vknow the Facts | టీ లేదా కాఫీకి ముందు నీరు త్రాగడం మీకు మంచిదేనా? – Andhra Waves

by andhra andhrawave
0 comments
కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా..ఈ నిజాలు తెలుసుకోండి..! | కాఫీ లేదా టీకి ముందు నీళ్లు తాగాలా vknow the Facts | టీ లేదా కాఫీకి ముందు నీరు త్రాగడం మీకు మంచిదేనా?


కాఫీ, టీ తాగడానికి ముందు మంచి నీరు తాగడం మంచిదేనా ? ఈ నిజాలు తెలుసుకోండి..!

ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వచ్చే ఉత్సాహమే వేరు. రోజువారి అలసటను పారద్రోలి, మనసును తేలికపరచడంలో కాఫీ, టీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే, మనలో చాలామందికి కాఫీ లేదా టీ తాగడానికి కొద్ది నిమిషాల ముందు కాస్త మంచినీరు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తాగడం మంచిదేనా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొందరైతే కాఫీ, టీ తాగడానికి ముందు నీరు తాగితే కడుపులో యాసిడ్లు పల్చబడిపోతాయని, దానివల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుందని చెబుతారు. మరి ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, అసలు సైన్స్ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుంటే..

ఎసిడిటీ పెరుగుతుందా?

కాఫీ , టీ తాగడానికి ముందు మంచి నీరు తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుందని అనుకోవడం కేవలం ఒక పొరపాటు లేదా అపోహ మాత్రమే. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు దీనికి చెబుతున్నారు. నిజానికి, టీ లేదా కాఫీ తాగడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరానికి , జీర్ణవ్యవస్థకు అనేక రకాల ప్రయోజనాలను పొందుతాయి.

కెఫీన్ ప్రభావం తగ్గుతుంది..

కాఫీ , తేయాకులలో సహజంగానే కెఫిన్ తో పాటు కొంతవరకు యాసిడ్ స్వభావం ఉంటుంది. పరగడుపున లేదా ఖాళీ కడుపుతో వీటిని నేరుగా తాగినప్పుడు, కడుపులోని చికాకు గురై ఎసిడిటీ, గుండెల్లో మంట, లేదా కడుపులో మీకు కలిగే అవకాశం ఉంది. అయితే, కాఫీ లేదా టీ తాగడానికి ఐదు నుండి పది నిమిషాల ముందు సాధారణ నీటిని తాగడం వల్ల, ఆ నీరు పొట్టలోని యాసిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది ఒక రక్షణ పొరలా పనిచేసి, కెఫిన్ పొట్ట గోడలపై నేరుగా చూపించే తీవ్ర ప్రభావం తగ్గుతుంది.

నీరు తాగడం వల్ల కడుపులోని రసాలు పల్చబడి జీర్ణక్రియ పాడవుతుందని అనుకుంటారు. మనం తాగే ఒక గ్లాసు నీరు పొట్టలో చాలా వేగంగా శోషించబడుతుంది. అదనంగా, నీరు పొట్టను జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. టీ, కాఫీలలో ఉండే టానిన్లు, కెఫిన్ వల్ల కడుపులో మంటను నివారించడంలో ఈ నీరు ఎంతగానో తోడ్పడుతుంది.

నోటి ఆరోగ్యం..

టీ, కాఫీలు తాగడం వల్ల వాటిలోని రసాయనాల దంతాలపై పసుపు రంగు మరకలను ఏర్పరుస్తాయి. అదనంగా దంతాల ఎనామిల్ ను బలహీనపరుస్తుంది. కాఫీ లేదా టీ తాగడానికి ముందు నీరు తాగడం వల్ల నోటిలోని పిహెచ్ స్థాయిలు మారుతూ దంతాల ఎనామిల్ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే, కాఫీ, టీలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహెడ్రేషన్ కు అవసరమైన ప్రమాదం ఉంది. అందుకే, ముందుగానే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

చివరిగా..

కాఫీ లేదా టీ తాగడానికి ముందు కొద్దిగా సాధారణ నీటిని తాగడం చాలా మంచి అలవాటు. ఇది ఎసిడిటీని పెంచకపోగా, మరింత తగ్గించి జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి టీ లేదా కాఫీకి కొద్ది నిమిషాల ముందు కొద్దిగా నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదే..

*రూపశ్రీ.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird