ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త మార్పులతో ముందుకెళ్తోంది. కేవలం చిన్న చిన్న రీల్స్, షార్ట్ వీడియోలకే పరిమితమైన ఈ యాప్ ఇప్పుడు యూజర్ల కోసం మరో బిగ్ అప్‌డేట్ తీసుకొచ్చింది. యూజర్లు ఇకపై స్టాగ్రామ్‌లో కేవలం సెకన్ల వీడియోలు మాత్రమే కాకుండా సుదీర్ఘమైన పెద్ద వీడియోలను కూడా ఆస్వాదించవచ్చు. దీనికోసం కంపెనీ ప్రత్యేక ఫీచర్స్ అనే కొత్త వీడియో ఫార్మాట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.
90 నిమిషాల వీడియోలకు అనుమతి
ఈ కొత్త ఫీచర్స్ ఫార్మాట్ ద్వారా ప్లాట్‌ఫామ్‌లోని ప్రముఖ క్రియేటర్లు ఏకంగా 90 నిమిషాల వరకు హారిజాంటల్ వీడియోలను పోస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా పాడ్‌కాస్ట్‌లు, స్పెషల్ ఇంటర్వ్యూలు, కామెడీ షోలు వంటి లాంగ్ టైం కంటెంట్ రూపొందించిన వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా చిన్న రీల్ క్లిప్ చూస్తున్న ప్రేక్షకులు నేరుగా ఆ ఫుల్ వీడియోకి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఫుల్ వీడియో చూసేందుకు వేరే యాప్‌లకు వెళ్లాల్సిన పనిలేకుండా యాప్‌లోనే ఉండిపోవచ్చు.
ఇది కూడా చదవండి: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు భారీ షాక్
అమెరికాలో టెస్టింగ్.. టీవీ యాప్ కూడా
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బ్రెజిల్‌లో మొదట పరీక్షించగా, ఇప్పుడు అమెరికాలో కొన్ని సెలక్టెడ్ క్రియేటర్ల వరకు పొడిగించారు. అయితే భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఈ వీడియోలను చూసేందుకు వీలుగా స్టాగ్రామ్ ఇన్ పెద్ద టీవీ యాప్‌ను కూడా అమెరికాలో శాంసంగ్, అమెజాన్ ఫైర్, గూగుల్ టీవీలలో ఉంచారు. త్వరలోనే ఆపిల్ టీవీ సపోర్ట్ కూడా రానుంది.
ఇది కూడా చదవండి: ఇన్ఫీనిక్స్ నుంచి అద్భుతమైన గేమింగ్ ఫోన్
స్పాన్సర్డ్ కంటెంట్
క్రియేటర్లు ఈ ఫీచర్ ద్వారా స్పాన్సర్డ్ కంటెంట్‌ను కూడా సులభంగా జోడించవచ్చు. ఈ వీడియోలను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం చేయకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా షేర్ చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తున్నారు. దీనితో పాటు సంబంధిత రీల్స్‌ను ఒకే చోట ఎపిసోడ్ల లాగా అమర్చుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ సిరీస్ ఫీచర్‌ను కూడా టెస్ట్ చేస్తున్నారు. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో క్రియేటర్లకు లభించే వాటా వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

