Home అంతర్జాతీయం Instagram కొత్త ఫీచర్: ఇన్ స్టా కొత్త ఫీచర్.. యూట్యూబ్ కు -Andhra Waves

Instagram కొత్త ఫీచర్: ఇన్ స్టా కొత్త ఫీచర్.. యూట్యూబ్ కు -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Instagram కొత్త ఫీచర్: సోషల్ మీడియా ప్రపంచంలో మరో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు రీల్స్.. షార్ట్ వీడియోలు.. ఫోటోలు.. స్టోరీలతో స్టా గ్రామ్ గుర్తింపు పొందింది. ఇకపై దీర్ఘకాలిక వీడియోలపై ఫోకస్ పెట్టింది. ఏకంగా 90 నిమిషాల పాటు వీడియో కంటెంట్ చూసే విధంగా ఫీచర్స్ అనే కొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా మొదలైనట్టు. దీనివల్ల యూట్యూబ్ తో ఇన్ స్టా గ్రామ్ పోటీ పడుతుంది. […]

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్: సోషల్ మీడియా ప్రపంచంలో మరో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు రీల్స్.. షార్ట్ వీడియోలు.. ఫోటోలు.. స్టోరీలతో స్టా గ్రామ్ గుర్తింపు పొందింది. ఇకపై దీర్ఘకాలిక వీడియోలపై ఫోకస్ పెట్టింది. ఏకంగా 90 నిమిషాల పాటు వీడియో కంటెంట్ చూసే విధంగా ఫీచర్స్ అనే కొత్త ఫార్మాట్ ను ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా మొదలైనట్టు. దీనివల్ల యూట్యూబ్ తో ఇన్ స్టా గ్రామ్ పోటీ పడుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫీచర్ కేవలం పరిమిత క్రియేటర్లతో టెస్టింగ్ స్టేజిలో ఉంది.

ఇప్పటివరకు ఇన్ స్టా గ్రామ్ లో చిన్న వీడియో చూసేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ఒకవేళ నిడివి పెద్దవిగా ఉన్న వీడియో.. ఇతర పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఇకపై ఆ అవసరం ఉండకూడదని ఇన్ స్టా గ్రామ్ భావిస్తోంది.. అయితే ఈ మార్పు వల్ల యూట్యూబ్ కు పోటీ ఎదురవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. యూజర్లు ఈ వేదికను ఎంచుకునే అవకాశం ఉంది.

ఇప్పటివరకు లాంగ్ వీడియోలు.. సినిమా విశ్లేషణలు.. పాడ్ కాస్ట్ లు.. ఇంటర్వ్యూల కోసం చాలామంది యూట్యూబ్ దాకా వెళ్లేవారు. ఇలాంటి మార్పులతో యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కంటెంట్ క్రియేటర్లకు వేదికగా మారింది. అయితే ఇప్పుడు ఇన్ స్టా మాతృ సంస్థ మెటా కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తే పోటీ పెరిగే అవకాశం ఉంది.

ఇక ఇప్పటివరకు యూట్యూబ్ లో వీడియోలు చేసే క్రియేటర్లు తమ కంటెంట్ ను ఇన్ స్టాలో చిన్న చిన్న రీల్స్ రూపంలో ప్రచారం చేసుకునేవారు. ఇకపై పూర్తి ఎపిసోడ్ ఇక్కడే ఉంచే అవకాశం ఉంది. రీల్స్ లో నచ్చిన పాడ్ కాస్ట్ లేదా ఇంటర్వ్యూ క్లిప్ కనిపిస్తే.. దానికి లింక్ చేసిన పూర్తి వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో చూసే అవకాశం ఉంటుంది. యాప్ లు మారాల్సిన ఇబ్బంది ఉండదు.

మూవీ రివ్యూలు. పొలిటికల్ లీడర్ల ఇంటర్వ్యూలు.. ఇతర కథనాలు.. స్పెషల్ స్టోరీలు. సెలబ్రిటీలతో డిస్కషన్ వంటి దీర్ఘ వీడియోలను రూపొందించే వారికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఎక్కువసేపు వినియోగదారులను తమ ప్లాట్ఫారంలో ఉంచగలిగితే ఈ యాడ్స్ రూపంలో అవకాశాలు పెరుగుతాయి. ఇక లాంగ్ వీడియోలను టీవీలో కూడా చూస్తే స్టా గ్రామ్ తన వీడియో సేవలను విస్తరిస్తుంది. పెద్ద తెరమీద పాడ్ కాస్ట్.. ఇంటర్వ్యూలు చూస్తే ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల యూట్యూబ్ గట్టి పోటీ ఎదుర్కోవాల్సి రావచ్చు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird