Home సినిమా Liquor Sales : దసరా జోష్.. మద్యం అమ్మకాల్లో నయా రికార్డు.. ఒక్క రోజే రూ.303 కోట్ల మేర తాగారు. – Andhra Waves

Liquor Sales : దసరా జోష్.. మద్యం అమ్మకాల్లో నయా రికార్డు.. ఒక్క రోజే రూ.303 కోట్ల మేర తాగారు. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Liquor Sales : దసరా జోష్.. మద్యం అమ్మకాల్లో నయా రికార్డు.. ఒక్క రోజే రూ.303 కోట్ల మేర తాగారు.


మద్యం అమ్మకాలు, వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తెలంగాణ ముందు వరుసలో ఉంటాయి. పుట్టుక, చావు, శుభకార్యం.. ఇలాంటి సందర్భం ఏదైనా సరే మన వాళ్లు తాగాల్సిందే. ఇక పండగ పూట మద్యం వినియోగం పెరుగుతుంది. తాజాగా దసరా సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఒక్క రోజులోనే వందల కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు జనాలు.

దసరా పండుగ వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం వ్యాపారానికి భారీ ఊతాన్ని ఇచ్చాయి. పండుగ సెలవులు, వేడుకల నేపథ్యంలో మద్యం కొనుగోళ్లు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగాయి. అక్టోబర్ ప్రారంభ విక్రయాలు కాస్త తగ్గాయి, పండుగ సమీపించడంతో రెండో వారం నుంచి ఊపందుకుంది. అక్టోబర్ మొదటి 19 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇదే సమయంతో అమ్మకాల విలువలో ఏకంగా 3702 శాతం వృద్ధి నమోదవడం.

ఆకాశాన్ని తాకిన బీర్ల విక్రయాలు

ఈ దసరా సీజన్ వ్యాపారంలో బీర్ల డిమాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్టోబర్ 1వ తేదీ నుండి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 30.37 లక్షల కేసుల బీర్లు కొనుగోలు అయ్యాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 21.55 లక్షల కేసులతో, ఈసారి అదనంగా 8.82 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఫలితంగా బీర్ల విక్రయాల్లో 40.93 శాతం మేర భారీ వృద్ధి కనిపించింది.

ఐఎమ్‌ఎఫ్ఎల్ కొనుగోళ్లలోనూ జోరు

బీర్లతో పాటు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) విక్రయాలు కూడా విశేషంగా పుంజుకున్నాయి. గత ఏడాది 14.16 లక్షల కేసులుగా ఉన్న IMFL అమ్మకాలు, ఈసారి 18.38 లక్షల కేసులకు చేరి 29.80 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్ 16వ తేదీ నాటికి రూ.1,527.85 కోట్లు ఉన్న మొత్తం మద్యం విక్రయాల విలువ, కేవలం మూడు రోజుల్లోనే రూ.2,000 కోట్ల రికార్డు దాటడం పండుగ కొనుగోళ్ల తీవ్రతను ప్రతిబింబిస్తోంది.

ఒక్కరోజే రూ.303.40 కోట్ల రికార్డు విక్రయాలు

ఈ సీజన్‌లో రోజువారీ అమ్మకాలను గుర్తించే, అక్టోబర్ 19వ తేదీన జరిగిన విక్రయాలు ఎక్సైజ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచాయి. ఆ ఒక్క రోజే ఏకంగా రూ.303.40 కోట్ల విలువైన మద్యం వ్యాపారం జరిగింది. ఇదే రోజు నమోదైన విక్రయాలతో పోల్చితే ఈసారి 801.90 శాతం వృద్ధి కనబడుతోంది. ప్రభుత్వ ఖజానాకు ప్రధాన వనరుగా ఉన్న ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ స్థాయి రాబడి సమకూరడంపై సర్వత్రా ఆసక్తి చూపుతోంది.

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird