Home సినిమా The Paradise: ది ప్యారడైజ్ పై ట్రోల్స్.. ఇచ్చి పడేసిన నాని.. – Andhra Waves

The Paradise: ది ప్యారడైజ్ పై ట్రోల్స్.. ఇచ్చి పడేసిన నాని.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


The paradise: ది ప్యారడైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది విశ్లేషకులు సినిమా బాగాలేదని చెప్పారు. మరికొందరేమే బాగుందని చెప్పారు. ఇంకొందరేమో సినిమా ఒక స్థాయిలో ఉందని వివరించారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. నాని కి క్లాస్ హీరోగా పేరుంది. ఈయన నటించిన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో నాని మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. దసరా.. సరిపోదా […]

స్వర్గం: ది ప్యారడైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది విశ్లేషకులు సినిమా బాగాలేదని చెప్పారు. మరికొందరేమే బాగుందని చెప్పారు. ఇంకొందరేమో సినిమా ఒక స్థాయిలో ఉందని వివరించారు. ఇలా ఎవరికివారు తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు.

నాని కి క్లాస్ హీరోగా పేరుంది. ఈయన నటించిన సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో నాని మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. దసరా.. సరిపోదా శనివారం.. ఇప్పుడు స్వర్గం. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించారు. సరిపోదా శనివారం మినహా మిగిలిన రెండు సినిమాలలో తెరమీద రక్తపాతం బీభత్సంగా జరిగింది. డైలాగులు.. నరుక్కోవడాలు.. తుపాకులు పేల్చడాలు.. ఒక స్థాయిని దాటిపోయాయి. నిజానికి ఈ సినిమాలను చూస్తుంటే ఇవి నా సినిమాలేనా అని అందరికీ అనిపించింది. నిజానికి నాని మోస్ట్ ప్రామిసింగ్ హీరో. కాకపోతే ఆయనకి ఫ్యామిలీ స్టార్ అనే బిరుదు ఉంది. అయితే తనకు అన్ని జానర్లు చేయకూడదని నాని పదే పదే చెప్పేవారు. అందుకే హిట్ 3, దసరా.. తాజాగా ది ప్యారడైజ్ సినిమాలు చేశారు.

ది ప్యారడైజ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు వస్తున్న నేపథ్యంలో నాని తొలిసారిగా స్పందించారు. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టైర్ 2 సెగ్మెంట్‌లో ఉన్న నాని ఈ స్థాయి దాక రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక దశలో ఆయన దగ్గర సినిమాలు విడుదలయితేనే గొప్ప అనుకునేనుంచి.. నేడు ఆయన సినిమా కోసం ఎదురుచూసే స్థాయికి ఎదిగారు. దీనిని బట్టి నాని రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే నాని తన సినిమా మీద వస్తున్న విమర్శల మీద స్పందించారు..” కాకపోతే ఈ సినిమా మీద రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర సరిగ్గా లేదని.. మోహన్ బాబు విలనిజం సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదని.. బాండెడ్ స్క్రిప్ట్ లేకపోవడం వల్లే సినిమా ఇలా అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సెకండ్ హాఫ్ కూడా ఉండి ఉంటే సినిమా ఫలితం ఎక్కడికో వెళ్లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్ లెవెల్ లో ఉంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird