Home ఆంధ్రప్రదేశ్ నగరి మున్సిపాలిటీ: నగరి టిడిపికి ఏకగ్రీవం.. రోజా దగ్గరుంది – Andhra Waves

నగరి మున్సిపాలిటీ: నగరి టిడిపికి ఏకగ్రీవం.. రోజా దగ్గరుంది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


నగరి మున్సిపాలిటీ: ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీలో కీలకమైన నాయకులు పేరుపొందిన వారి నియోజకవర్గాల పోటీలో పోరా పోరిగా సాగుతోంది అనుకుంటే.. ఏకపక్షంగా ముగుస్తుంది. అయితే టిడిపి లేకుంటే జనసేన.. లేకుంటే బిజెపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి. సాధారణంగా గ్రామాలలో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారంటే ఏదో ఒప్పందం కుదిరింది అనుకోవచ్చు.. కానీ మున్సిపాలిటీలను కూడా ఏకగ్రీవం చేసుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు. వైసీపీ కీలకలో నాయకురాలు.. […]

నగరి మున్సిపాలిటీ: ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీలో కీలకమైన నాయకులుగా పేరుపొందిన వారి నియోజకవర్గాల పోటీలో పోరా పోరిగా సాగుతోంది అనుకుంటే.. ఏకపక్షంగా ముగుస్తుంది. అయితే టిడిపి లేకుంటే జనసేన.. లేకుంటే బిజెపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి. సాధారణంగా గ్రామాలలో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారంటే ఏదో ఒప్పందం కుదిరింది అనుకోవచ్చు.. కానీ మున్సిపాలిటీలను కూడా ఏకగ్రీవం చేసుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు.

వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్న మాజీ మంత్రి రోజా నాయకురాలు.. నగరి నియోజకవర్గంలో టిడిపి తిరుగులేని విజయాన్ని అందుకుంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుపొందిన రోజా.. అనుచరులతో దగ్గరుండి మరి నామినేషన్లు వేయించారు. అయినా ఇక్కడ టిడిపి ఏకపక్షంగా నగరి నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది. రోజా దగ్గరుంది మరి నామినేషన్లు వేయించడానికి.. ఒక్కదాంట్లో సరైన వివరాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దాడులు.. విధ్వంసాలు జరిగితే.. నగరి ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చోట రోజా తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు.

వైసీపీలో తనకు తానే గొప్ప లీడర్ అని చెప్పుకుంటారు రోజా. పైగా తనకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు సవరిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. సస్పెండ్ చేయించే దాకా వెనుకాడరు.. ఇక తాజాగా నగరిలో క్షేత్రస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడంలో రోజా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ స్థానం చేజారిపోయిందని విమర్శలు వచ్చాయి. దీని వెనక ఏదైనా జరిగిందా.. ప్రత్యర్థి పార్టీతో ఒప్పందం చేసుకున్నారా.. అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏకగ్రీవం కావడానికి రోజా కారణమని మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆమె ఖండించారు. అంతేకాదు కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని రోజా చెబుతున్నారు. డెమోక్రసీని అబాహ్యం చేసే విధంగా అధికార పార్టీ కుట్ర చేసిందని రోజా ఆరోపిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీకి మున్సిపాలిటీని అప్పగించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపాలిటీలు లేదా ఇతర స్థానాలు ఏకగ్రీవం అయితే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రకారం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రోజాకు జగన్ టికెట్ ఇవ్వరా.. ఇచ్చే అవకాశం లేదా.. ఒకవేళ టికెట్ ఇస్తే జగన్ తన మాట తానే తప్పినట్లు అవుతారు కదా అని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird