‘జవాన్’తో దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగించిన అట్లీ, ఇప్పుడు తనక్స్ట్ ప్రాజెక్ట్ ‘రాకా’ కోసం అంతకుమించిన ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు ఇచ్చిన ఇంటర్వ్యూ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాల్లో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని అట్లీ ఈ చిత్రం కోసం సృష్టించబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది పూర్తిగా అట్లీ కన్న కల. ఇందులో కనిపించే పాత్రలు, మనుషులు చాలా డిఫరెంట్‌గా ఉంటారు. మేం కూడా ఇలాంటి క్యారెక్టర్‌లను గతంలో ఎప్పుడూ చూడలేదు. అంతేకాదు ఇందులో కొన్ని పాత్రలకు ఎక్స్’ పవర్స్ కూడా ఉన్నాయి” అని చెప్పారు. ఈ కామెంట్స్‌తో ఈ సినిమా ఏదో రొటీన్ యాక్షన్ డ్రామా కాదని, భారీ ఫాంటసీతో కూడిన సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోందని అర్థమవుతోంది.
ఈ సినిమాలో వాడిన టెక్నాలజీ గురించి చెబుతూ ఆయన అసలైన సస్పెన్స్ లీక్ ఇచ్చారు. గతంలో ‘జవాన్’ సినిమాలో బాడీ డబుల్ కోసం మాత్రమే మోషన్ క్యాప్చర్ ఉపయోగించామని, కానీ ‘రాకా’ కోసం తాము టెక్నాలజీని అత్యధికంగా మోక్యాప్ని వాడుతున్నామని. “ఇప్పుడే దీని గురించి ఎక్కువ మాట్లాడితే సినిమా స్పాయిలర్ అవుతుంది. అసలు మేం ఎందుకు ఇంత భారీగా మోక్యాప్ వాడామో సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లలో చూస్తే మీకే తెలుస్తుంది” అంటూ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అట్లీ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ వింత ప్రపంచం, అందులోని విభిన్న శక్తులు ఉన్న పాత్రలు వెండితెరపై ఆడియన్స్‌కు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ కోసం ఈ భారీ పాన్ – ఇండియా చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.

