బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఈ దారుణానికి పాల్పడి ట్రైన్లో పారిపోతున్న నిందితులను రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. జుహూలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన వెంటనే నిందితులు ముంబై దాటిపోవాలని ప్లాన్ చేశారు.
ఎవరికీ అనుమానం రాకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ముంబై పోలీసులు ఇచ్చిన పక్కా సమాచారంతో రాజస్థాన్ పోలీసులు రంగంలోకి దిగి కోట రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ముగ్గురిని గుర్తించి, తప్పించుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు.
ఆదివారం సాయంత్రం జుహూ గ్రౌండ్లో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగించుకుని టైగర్ ష్రాఫ్ తన కారులో ఉండగా ఈ షాకింగ్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన నిందితులు ఒక్కసారిగా ఆయనను టార్గెట్ చేస్తూ కారుపై కాల్పులకు తెగబడ్డారు. టైగర్ ష్రాఫ్ వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది కానీ, ఆయన డ్రైవర్‌తో పాటు కారులో ఉన్న మరొకరికి బుల్లెట్ గాయాలయ్యాయి.
ప్రస్తుతం వారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. పట్టుబడిన నిందితుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందనే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తున్న ఈ ముఠా, టైగర్ శ్రాఫ్పై ఎందుకు దాడి చేసింది, బెదిరింపుల కోసమా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
The post టైగర్ శ్రాఫ్పై ఎటాక్ – ముగ్గురు అరెస్ట్! iDreamPostలో మొదటిసారి కనిపించారు.
