Home సినిమా అఫీషియల్: ‘ఆదర్శ కుటుంబం’ కొత్త డేట్ చెప్పేసిన నాగవంశీ.. నాగార్జున ఏం చేయబోతున్నారు.? – Andhra Waves

అఫీషియల్: ‘ఆదర్శ కుటుంబం’ కొత్త డేట్ చెప్పేసిన నాగవంశీ.. నాగార్జున ఏం చేయబోతున్నారు.? – Andhra Waves

by andhra andhrawave
0 comments
tmdb-header-middle-logo


విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించిన మేకర్స్.. ఆ అక్టోబర్ తర్వాత 9కి మార్చారు. కానీ ఆ డేట్ కి కూడా సినిమా థియేటర్లలోకి రాలేదు.

‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 30న విడుదలవుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ, ఇంతవరకు అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయకపోవడం, ప్రమోషన్స్ లో కూడా కదలిక లేకపోవడంతో.. ఇక ఇప్పట్లో సినిమా విడుదల కావడం లేదని భావించారంతా. అయితే ఇప్పుడు అనూహ్యంగా అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ వస్తుందని హింట్ ఇచ్చి నిర్మాత నాగవంశీ సర్ప్రైజ్ చేశారు.

తాజాగా జైలర్-2 ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. “ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ ని నా నోటితో చెప్పాను. కానీ, మీరు డేట్ కే వస్తున్నాం. అక్టోబర్ 21 లేదా 22న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ లో వెంకటేష్ గారు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.” అన్నారు.

అంతేకాదు, ఒక జర్నలిస్ట్ అక్టోబర్ 30న వస్తుందా అని అడగగా.. అవును అని నాగవంశీ సమాధానం ఇవ్వడం విశేషం. నాగవంశీ మాటలను బట్టి చూస్తే.. ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30న రావడం ఖాయంగా కనిపిస్తుంది.

అయితే అదే రోజున నాగార్జున సమర్పణలో వస్తున్న ‘ఇట్లు అర్జున’ విడుదల జారీ. ఇప్పటికే ఆదర్శ కుటుంబం వల్ల రెండు సార్లు డేట్ మార్చుకున్న ఈ సినిమా మరోసారి ఇబ్బంది పడనుంది.

రీసెంట్ గా జరిగిన ‘ఇట్లు అర్జున’ ఈవెంట్‌లో నాగార్జున కూడా ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు. నేరుగా ఆదర్శ కుటుంబం సినిమా పేరు తీసుకురాలేదు కానీ, పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే మార్చడం వల్ల చిన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ‘గాడ్ ఆఫ్ వార్’ వెనక్కి.. ఎన్టీఆర్-నెల్సన్ ప్రాజెక్టుకి ముహూర్తం ఫిక్స్.!

[Aadarsha Kutumbam New Release Date, Aadarsha Kutumbam October 30 Release, Aadarsha Kutumbam On Oct 30th, Producer Naga Vamsi, Victory Venkatesh, Trivikram Srinivas, Nagarjuna, Itlu Arjuna, Telugu Film News]

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird