
స్థానిక సంస్థల ఎన్నికల వేళ, వైసీపీ సీనియర్ నాయకుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. పట్టణంలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ముందస్తు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎన్నికల వేళ నిబంధనలకు కట్టుబడుతూ, పులివెందులలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు. నేతలు, కార్యకర్తలు నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
కాగా పులివెందుల పట్టణంలో స్థానిక ఎన్నికల వేడి ఊపందుకుంటున్న తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పులివెందుల పట్టణంలో ఎన్నికల కోడ్, శాంతిభద్రతల దృష్ట్యా ప్రస్తుతం సెక్షన్ 144తో పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉన్నట్లు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం పులివెందుల ప్రాంతంలో అనుమతు తెలిపారు. ఎన్నికల ప్రచారాలు లేదా ఇతర సమావేశాల సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.

గతంలో ఎన్నికల సమయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, పరిస్థితులను బేరీజు వేసుకుంటూ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయ పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చేలా అధికారులు వివిధ మార్గాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
[Pulivendula Police Notices YS Avinash Reddy, Section 144, Local Body Elections, Law And Order, Pulivendula Municipal Elections, Telugu One]
