Home సినిమా Agipette Maccha: అగ్గిపెట్టె మచ్చ మరణం.. వైజాగ్ సత్య – Andhra Waves

Agipette Maccha: అగ్గిపెట్టె మచ్చ మరణం.. వైజాగ్ సత్య – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Agipette Maccha: సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చ కన్నుమూశారు. తీవ్రమైన జ్వరం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడు.. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనికి మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.. సోషల్ మీడియాలో అగ్గిపెట్టే మచ్చకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. రాయలసీమ యాసను ఆయన తనదైన శైలిలో మాట్లాడేవారు. పైగా లుంగీని ఎత్తి కట్టడంలో తన మేనరిజం చూపించేవారు. రాయలసీమ […]

అగిపెట్టె మచ్చ: సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన అగ్గిపెట్టె మచ్చ కన్నుమూశారు. తీవ్రమైన జ్వరం.. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడు.. తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనికి మెదడులో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది..

సోషల్ మీడియాలో అగ్గిపెట్టే మచ్చకు విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. రాయలసీమ యాసను ఆయన తనదైన శైలిలో మాట్లాడేవారు. పైగా లుంగీని ఎత్తి కట్టడంలో తన మేనరిజం చూపించేవారు. రాయలసీమ యాస మాట్లాడటం.. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులరిటీ సొంతం చేసుకోవడంతో.. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. దీనితో అనేక టీవీ షోలలో అగ్గిపెట్టే మచ్చకు అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా జబర్దస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో అగ్గిపెట్టె మచ్చ చేసిన సందడి మామూలుగా లేదు.

అగ్గిపెట్టె మచ్చ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో వైజాగ్ సత్య కీలక వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ సత్య బృందంలో కీలకమైన వ్యక్తులు ఇటీవల కాలంలో వరుసగా మరణిస్తున్నారు. కుర్చీ తాత.. అంతకుముందు రాకేష్ మాస్టర్.. ఇప్పుడు అగ్గిపెట్టె మచ్చ.. యముడు తన పాశాన్ని తమ బృందం మీద వదలాడని.. అందుకే వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయని సత్య ఆవేదన వ్యక్తం చేశారు. ”అగ్గి పెట్టే మచ్చ తీవ్రమైన జ్వరానికి కారణమైంది.అపస్మారక స్థితిలో ఉంటే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వచ్చిన వైద్యులు ఆయనకు మెదడులో ఇన్ఫెక్షన్ సోకిందని పేర్కొన్నారు.వెంటనే ఆపరేషన్ కూడా చేశారు. భగవంతుడు అండగా ఉండాలని” సత్య ఉన్నాడు.

అగ్గి పెట్టె మచ్చ మద్యం తాగేవాడు. ధూమపానం చేసేవాడు. అందుకే అతని ఆరోగ్యం ఇలా విషమించిందని వార్తలు వస్తున్నాయి. రాయలసీమ ప్రాంతంలో మారుమూల గ్రామానికి జన్మించిన అతడు.. పేద కుటుంబంలో ఉన్నాడు. కాకపోతే సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. టీవీ షోలలో కనిపించేవాడు. ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా అతడు సందడి చేశాడు. చివరికి ఇలా కన్ను మూశాడు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird