Home సినిమా Vijay Deverakonda: విజయ్ దేవరకొండ గెలిచాడు! పెయిడ్ మాఫియా ఓడింది! ఇది రౌడీ లెక్క! – Andhra Waves

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ గెలిచాడు! పెయిడ్ మాఫియా ఓడింది! ఇది రౌడీ లెక్క! – Andhra Waves

by andhra andhrawave
0 comments
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ గెలిచాడు! పెయిడ్ మాఫియా ఓడింది! ఇది రౌడీ లెక్క!


రౌడీబాయ్ విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమాతో ట్రోలర్స్‌, పెయిడ్ మాఫియాకు గట్టి సమాధానం ఇచ్చారు. తన నటనతో వారి నోళ్లు మూతపడేలా చేశారు. రణబాలి సినిమా టీజర్, ట్రైలర్ విడుదల అయిన సమయంలో విజయ్ రాయలసీమ యాస, గెటప్‌పై విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సారి విజయ్ అడ్డంగా దొరికిపోతాడు అంటూ కొంతమంది పనిగట్టుకుని ట్రోలింగ్స్ మొదలెట్టారు. పెయిడ్ మాఫియా ఒకే రకమైన ట్వీట్లు వరుసగా వేస్తూ వచ్చింది. ఇవంతా సినిమా విడుదల ముందు వరకు జరిగిన కుట్రలు.

విజయ్ తన నటనతో పెయిడ్ బ్యాచ్ కుట్రల్ని నాశనం చేశారు. విజయ్‌కి కేవలం ఒకే యాస వచ్చు అనే అపవాదును ఈ సినిమాతో పూర్తిగా తుడిచేశారు. ‘రణబాలి’ సినిమాలో 1870ల నాటి రగ్గడ్ రాయలసీమ యువకుడిగా విజయ్ ఊరమాస్ లుక్‌లో కనిపించడమే కాకుండా, నూటికి నూరు శాతం రాయలసీమ యాసను అత్యంత సహజంగా పలికారు. సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు, విశ్లేషకులు సైతం విజయ్ డైలాగ్ డెలివరీ, బేస్ వాయిస్‌కు ఫిదా అవుతున్నారు. ఒక నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ చేసిన ఈ ప్రయోగం పెయిడ్ బ్యాచ్ళ్లు మూయించేలా చేసింది.

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లోనూ విజయ్ పలికించిన హావభావాలు ఆయనలోని పరిణతి చెందిన నటుడిని బయటకు తీశాయి. పెయిడ్ నెగిటివ్ ప్రచారాల కంటే కంటెంట్, నటన మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించినట్లు ‘రణబాలి’ నిరూపించింది. రణబాలి సినిమా కూడా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ముందు సినిమాపై ఎంత నెగిటివిటీ సృష్టించాలని చూసినా.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 16.50 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రౌడీ హీరో క్రేజ్‌ను నిరూపించాయి. విజయ్ దేవరకొండ నటుడిగా గెలిచారు. ఓ పెయిడ్ మాఫియా పని గట్టుకుని చేసిన దుష్ప్రచారం ఓడిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రచయిత అవతార్

వెంకటేశ్వర్లు

నా పేరు వెంకటేశ్వర్లు. iDreamPost.comలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. 2023 నుంచి ఐడ్రీమ్‌తో నా ప్రయాణం మొదలైంది. ఇక్కడ సినిమా, జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, రాజకీయాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటాను. 2016లో జర్నలిజం వైపు వచ్చాను. జర్నలిజంలో పీజీ డిప్లొమా చేశాను. నాకు జర్నలిజంలో 9 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. 2017లో సాక్షి వెబ్ డెస్క్ నుంచి వృత్తిపర జర్నీ మొదలైంది. ఆ తర్వాత సుమన్ టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెబ్‌సైట్‌లో సేవలను అందించాను.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird