Home Latest News అమరావతి ఇప్పుడెలా ఉందో చూశారా: లోకేష్ వీడియో వైరల్.! | అమరావతి | నిర్మాణాలు | వేగం | లోకేష్ | వీడియో | షేర్ చేయండి | సోషల్ మీడియా – Andhra Waves

అమరావతి ఇప్పుడెలా ఉందో చూశారా: లోకేష్ వీడియో వైరల్.! | అమరావతి | నిర్మాణాలు | వేగం | లోకేష్ | వీడియో | షేర్ చేయండి | సోషల్ మీడియా – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి వేగాన్ని కళ్లకు కడుతూ మంత్రి నారా లోకేశ్ నాడు-నేడు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రజా రాజధాని వంద రోజులకు ఒక అడుగు చొప్పున ముందుకు సాగుతోందని ఆయన వీడియోలో పేర్కొన్నారు. పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం, అంకితభావంతో శ్రమించే బృందం ఈ అద్భుత పురోగతికి కారణంగా అభివర్ణించారు.

నారా లోకేష్ తాజాగా విడుదల చేసిన వీడియోలో గతంతో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వచ్చిన మార్పులు, వేగం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో యంత్రాలు, కార్మికుల సమన్వయంతో ప్రాజెక్టులు వేగంగా సాగుతున్న విషయం క్లియర్ కట్ గా అర్ధమౌతుంది. అమరావతి అన్ స్టాపబుల్ అన్న హ్యాష్ ట్యాగ్ తో ఈ వీడియోను షేర్ చేసిన లోకేష్.. ప్రజల రాజధాని కల సాకారమౌతోందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అంశాలు రాష్ట్ర, పరిపాలనలో ఎప్పుడూ కీలక ప్రాధాన్యతలు ఉన్నాయి. గతంలో ఎదురైన ఆటంకాలు, నిలిచిపోయిన పనుల నేపథ్యంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.

రానున్న రోజుల్లో వంద రోజుల ప్రగతి నివేదికలు, దశలవారీగా పూర్తయ్యే నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను కూడా మంత్రి షేర్ చేస్తానన్న సంకేతం ఈ వీడియో ద్వారా ఆయన ఇచ్చారు.

ఇది కూడా చదవండి: బాబు భేష్: అమరావతి నిర్మాణ వేగం శభాష్: ఏపీ సీఎంపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు.!

రాజధాని నిర్మాణ ప్రక్రియలో పారదర్శకత, వేగం, సమన్వయం కీలకమని, రాబోయే కాలంలో మరిన్ని ప్రాజెక్టులు ఊపందుకు అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి, ‘నాడు-నేడు’ వీడియో ద్వారా అమరావతి నిర్మాణ వేగాన్ని ప్రజల ముందుంచిన మంత్రి నారా లోకేశ్, ప్రతి వంద రోజులకు రాజధాని కొత్త రూపు సంతరించుకుంటోందనే సందేశాన్ని ఇచ్చారు.

రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిర్దుష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న సంకల్పాన్ని ఈ విడియో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. విచారణ నటిజనులు అమరావతి సాకారం అంటూ చెబుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వేగం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: అమరావతి 12వ శతాబ్దపు రాజధాని చరిత్ర!

హైదరాబాద్ గతం.. అమరావతి భవిష్యత్.. చంద్రబాబునాయుడు

[Amarawati, Constructions, Speed, lokesh, Video, Share, Socialmedia, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird