Home Latest News కోనసీమకు ఉప్పెన ముప్పు: మహోగ్రంగా దూసుకొస్తున్న ఆక్వాన్.! | తుఫాను | అక్వాన్ | కోనసీమ | కోరంగి | ఉప్పాడ | ఉప్పెన – Andhra Waves

కోనసీమకు ఉప్పెన ముప్పు: మహోగ్రంగా దూసుకొస్తున్న ఆక్వాన్.! | తుఫాను | అక్వాన్ | కోనసీమ | కోరంగి | ఉప్పాడ | ఉప్పెన – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


బంగాళాఖాతంలో ఏర్పడి అక్వాన్ తుపాను తన గమనాన్ని స్వల్పంగా చేసుకుని కొనసీమ వైపు దూసుకువస్తున్నది. తాజా వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు అక్వాన్ తుపాను కోనసీమ జిల్లా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో ఉమ్మడి తూర్పుగోదావరి ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కోరంగి, ఉప్పాడ తీర ప్రాంతాలకు భారీ ఉప్పెన ముప్పు పొంచి ఉందన్న సంఘటనలు గతంలో సంభవించిన కోనసీమ ఉప్పెనను గుర్తుకు తెస్తున్నాయి.

తుపాను దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160కి మించిన వేగంతో పెనుగాలులు వేస్తాయి. ఇక పోతే అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల కారణంగా కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనావేసి ప్రజలను అప్రమత్తం చేశారు. కోరంగి మడ అడవుల ప్రాంతం, ఉప్పాడ తీర గ్రామాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందన్న అంచనాతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాలను చేపట్టారు.

గతంలో సంభవించిన తుపానుల ధాటికి ఇప్పటికే ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్వాన్ తుపాను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అర్నబ్, మురసు తుపానుల ధాటికి అతలాకుతలమైన ప్రాంతాలు మళ్లీ అక్వాన్ తుపాను విరుచుకుపడనుండటం ఆందోళన కలిగిస్తోంది.

వరుస ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే ఉద్యాన పంటలు, వరి పొలాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే, ఇప్పుడు అక్వాన్ తుపాను ఏ స్థాయిలో నష్టం కలిగిందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. తుపాను దిశ మారిన నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇది కూడా చదవండి: అర్నాబ్ ఎఫెక్ట్: కోనసీమ అంధకారం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, తగ్గని గాలుల తీవ్రత.!

ఉప్పెన ప్రమాదం పొంచి ఉన్న కోరంగి, ఉప్పాడ సహా కోనసీమ తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయడంతో, పడవలను సురక్షిత ప్రదేశాల్లో లంగరు వేసుకోవాలని సూచించారు.

అక్వాన్ తుపాను మరింత బలపడి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందున, తీరం దాటే సమయానికి బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురవనున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే ప్రమాదం ఉన్నందున అత్యవసర సహాయక బృందాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని, అధికారిక హెచ్చరికలను అందజేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: న వంబ‌ర్ 19.. చ‌రిత్ర‌లో చేదు జ్ఞాప‌కం.. దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం..

ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!

[Cyclone, Akwan, Konaseema,  Corangi, Uppada, Uppena,  TeluguOne News]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird