
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. ఐదు శతాబ్దాల సుదీర్ఘ విద్యా చరిత్ర కలిగిన బ్రిటన్‌లోని ప్రఖ్యాత బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతిలో ఏర్పాటు అవుతోంది. ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో భారతదేశంలో తన రెండో క్యాంపస్‌ను బెడ్ ఫోర్ట్ అమరావతిలో ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ విద్యా ప్రాజెక్టుకు ఆదివారం, (నవంబర్ 29) భూమిపూజ కార్యక్రమం జరగనుంది. వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరిస్తూ హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీ, మా లక్ష్మి గ్రూప్ చైర్మన్ హరీష్ చంద్ర ప్రసాద్ యార్లగడ్డ.. దాదాపు 500 అమరావతి వారసత్వ సంస్థను తీసుకురావడం కేవలం ఒక పాఠశాల ఏళ్ల నిర్మాణానికి పరిమితం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాల వికాసంతో పాటు రాజధాని నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే దీర్ఘకాలిక పెట్టుబడిగా అభివర్ణించారు. స్థానిక విద్యార్థులు సొంత రాష్ట్రంలోనే ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించేందుకు ఈ క్యాంపస్ దోహదపడ.
ప్రణాళిక ప్రకారం బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతి క్యాంపస్‌లో 2028 ఏప్రిల్ నాటికి విద్యా తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఇక్కడ విద్యాబోధన అందించబడుతుంది. కేవలం గది తరగతి పాఠాలు, పరీక్షలకే పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పాఠ్యప్రణాళికను రూపొందించారు.

ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో నాయకత్వ లక్షణాలు, సృజనాత్మక ఆలోచనా విధానం, క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. విద్యార్థుల్లో విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, మానవతా విలువలు, ప్రపంచ స్థాయి దృక్పథాన్ని పెంపొందించే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ విద్యా సంస్థ పనిచేయనుంది.
ఇది కూడా చదవండి: అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడానికి సంకల్పంతో ముందుకు సాగుతున్న యార్లగడ్డ వివరించారు. అంతర్జాతీయ అంతర్జాతీయ నగరంగా, విద్య, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి, ప్రోత్సాహం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్‌కు చెందిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ ఇప్పటికే భారత్‌లో మొహాలీలో తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించే దిశగా అడుగులు వేయగా, ఇప్పుడు అమరావతిలో రెండో క్యాంపస్ ఏర్పాటు చేయడం విశేషం.
.webp)
ఒక రాజధాని వైపు నిర్మాణ పనులు ఊపందుకుంటుండగా, మరో వైపు అంతర్జాతీయ విద్యా సంస్థల ప్రవేశం అమరావతి అభివృద్ధికి మరింత బలాన్ని చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. నాణ్యమైన విద్యా ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల విద్య, పరిశోధన, నివాస రంగాల అభివృద్ధికి కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. మొత్తానికి, 500 ఏళ్ల బ్రిటిష్ విద్యా వారసత్వం కలిగిన బెడ్‌ఫోర్డ్ స్కూల్ అమరావతిలో అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కీలక పరిణామంగా నిలవనుంది.
మీకు నచ్చవచ్చు: అమరావతికి శుభారంభం.. XLRI ఏర్పాటు!
జగన్ ద్వేషం.. అమరావతికి వరం!!
[Bedford School Amaravati, Amaravati international Schools, Ground breaking ceremony, Bhumi Pujan, TeluguOne]
