రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న అతి భారీ సినిమా వారణాసి.ఇప్పటి వరకు తెలుగులో ఇంత భారీ సినిమా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల ప్లానింగ్ లో వుంది. ఈ సినిమా మీద అంచనాలు ఆకాశం అంత ఎత్తులో ఉన్నాయి. 2027 ఏప్రిల్ 7న విడుదల అన్నది ఇప్పటి వరకు వున్న డేట్. కానీ ఈ తేదీకి వస్తుందా? రాదా? అన్న అనుమానాలు వుండనే వున్నాయి. దానికి ఎవరి ఊహాగానాలు వాళ్లు చేస్తున్నారు. కానే కాదు, అనుకున్న డేట్ కు వస్తుందనే మాట గట్టిగా వినిపిస్తోంది మరోపక్కన.
అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనుకున్న డేట్ కు రావడం, రాకపోవడం అనేది నెట్ ఫ్లిక్స్ ఓటిటి డేట్ మీద ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ సమస్య లేదు. కొద్ది రోజుల షూట్ మినహా అంతా అయిపోయింది. డిసెంబర్ లో కీరవాణి తనయుడు పెళ్లి పనుల్లో రాజమౌళి ప్రస్తుతం ఉంటాడు. అందువల్ల జనవరిలో మిగిలిన వర్క్ ఫినిష్ చేస్తారు. అది సమస్య కాదు.
కానీ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ 160 కోట్ల బడ్జెట్ ను వారణాసి కోసం కేటాయించాలి. దాని లెక్కలు దానికి వుంటాయి. పైగా బడ్జెట్ ను 2027-28 ఫైనాన్సియల్ ఇయర్ నుంచి కేటాయించే అవకాశం ఎక్కువ ఉంటుంది, సెకండాఫ్ లో కూడా అని సూచిస్తుంది. అయితే జూలై సినిమా మూడో వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలో షెడ్యూల్ చేయవలసి ఉంటుంది.
ఇదిలా వుంటే నెట్ ఫ్లిక్స్ డీల్ క్లోజ్ అయ్యే వరకు ఓవర్ సీస్ డీల్ కూడా క్లోజ్ కాదు. ఎందుకంటే నెట్ ఫిక్స్ కొన్ని దేశాల్లో థియేటర్ ల విడుదల కూడా డీల్ చేస్తుంది. అందుకోసం సీసీ బయ్యర్ కు ఆ దేశాల్లో విడుదల ఛాన్స్ వుండదని ఓవర్ సీస్ అంచనా.అవన్నీ చూసుకుని ఓవర్ సీస్ రేటు ఫైనల్ చేసుకోవాలి.
నెట్ ఫిక్స్ డీల్ ఫినిష్ అయిపోతే డేట్ క్లారిటీ వస్తుంది. అప్పుడే ఓవర్ సీస్ రేటు కూడా క్లారిటీ వస్తుంది.
The post ఎక్స్ క్లూజివ్ వారణాసి వాయిదా తప్పదా? iDreamPostలో మొదట కనిపించారు.
