Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: సాక్షిలో వాటా లేదు – Andhra Waves

YS Jagan Mohan Reddy: సాక్షిలో వాటా లేదు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో విలువలు పాటించాలి. ప్రత్యర్థుల మీద కూడా అప్పుడప్పుడు మానవత్వాన్ని ప్రదర్శించాలి. అలాకాకుండా చేతిలో మీడియా ఉంది.. ఏది వస్తే అది రాస్తాం. ఏది తోస్తే అది ప్రచారం చేస్తాం. అంటే జనం ఊరుకోరు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది. అలాంటప్పుడు జనాలు తమ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా బయటపెడుతుంటారు. అవసరమైతే చర్నాకోల్ దెబ్బ లాంటి మాటలతో బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీ అధినేత […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో విలువలు పాటించాలి. ప్రత్యర్థుల మీద కూడా అప్పుడప్పుడు మానవత్వాన్ని ప్రదర్శించాలి. అలాకాకుండా చేతిలో మీడియా ఉంది.. ఏది వస్తే అది రాస్తాం. ఏది తోస్తే అది ప్రచారం చేస్తాం. అంటే జనం ఊరుకోరు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా బలంగా ఉంది. అలాంటప్పుడు జనాలు తమ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా బయటపెడుతుంటారు. అవసరమైతే చర్నాకోల్ దెబ్బ లాంటి మాటలతో బుద్ధి చెబుతారు. ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఎదురవుతోంది.

జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన సోదరి షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. కార్యకర్తల్లో ధైర్యం నింపారు. ఉమ్మడి కడప జిల్లాలో వైయస్సార్ లేగసిని కాపాడారు. కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచారు. జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత… పార్టీ మరింత బలోపేతం అయిందంటే దానికి ప్రధాన కారణం షర్మిల. ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకున్న జగన్.. ఆ మాటను పక్కన పెట్టారు. ఆమెను దూరం పెట్టారు. చివరికి తనే చెప్పిన ఆస్తుల విభజన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. పదవి ఇవ్వలేదు. కీలక పార్టీలో స్థానం కల్పించలేదు. ఇంటికి దూరం చేశారు. ఆస్తులకు దూరం చేశారు. ఎటు కాకుండా ఆమెను ఏకాకిని చేశారు. సొంత అన్న అలా చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. బయటికి వచ్చేసింది. సొంత పార్టీ పెట్టుకుంది. ఆ తర్వాత ఆస్తుల విషయంలో తనకు రావలసిన హక్కుల గురించి కోర్టు మెట్ల దాకా ఎక్కింది. ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగడం లేదు. చివరికి సొంత కూతురు పెళ్లి విషయంలో కూడా అన్న తన పంతాన్ని నెగ్గించుకోవడంతో షర్మిల కంటికి ధార లాగా విలపిస్తున్నారు.

తన కుమార్తె వివాహ పత్రికను ఇటీవల ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇచ్చారు. దీనిని కూడా జగన్ రాజకీయం చేశారు. తన సొంత మీడియాలో రాయలేని భాషలో వార్తలు రాయించారు. ఒకరకంగా షర్మిల వ్యక్తిత్వాన్ని మరింత కించపరిచారు. ఇలాంటి సమయంలో ఏ ఆడబిడ్డకైనా సరే కన్నీరు కట్టలు తెచ్చుకుంటుంది. షర్మిల పరిస్థితి కూడా అదే. అటు ఆస్తులు ఇవ్వకపోగా.. చివరికి తన సొంత మీడియాలోనే షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరిచే దిశగా జగన్ దిగజారిపోవడంతో ఆవేదన చెందుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న షర్మిలను కాదనుకొని.. ఎవరో కిరాయి వ్యక్తుల మాటలు నమ్మి సొంత చెల్లిని జగన్ దూరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికీ ఆస్తుల వాటా తేలలేదు. ఎప్పటికీ తేలుతుందో లేదో తెలియదు. కానీ షర్మిల జగన్ మీడియాలో నిత్యం విమర్శలకు గురవుతూనే ఉన్నారు. అభియోగాలు మోస్తున్నారు. తండ్రి లాంటి వ్యక్తికి పెళ్లి కార్డు ఇస్తే దాన్ని కూడా వక్రీకరించడం నిజంగా జగన్ కే చెల్లింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird