Home ఆంధ్రప్రదేశ్ Neerukonda Reservoir: అమరావతి ఊపిరి పీల్చుకో.. – Andhra Waves

Neerukonda Reservoir: అమరావతి ఊపిరి పీల్చుకో.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Neerukonda Reservoir:తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నీటి కరువు తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరానికి సరిగా చలికాలంలోనే తాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వేసవికాలంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కంపెనీలకు.. హాస్టళ్లకు ప్రత్యేక నిబంధనలు విధించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాలని.. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో పరిస్థితిని చూసిన ఏపీ ముఖ్యమంత్రి […]

Neerukonda Reservoir:తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో నీటి కరువు తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరానికి సరిగా చలికాలంలోనే తాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఇక వేసవికాలంలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వం కంపెనీలకు.. హాస్టళ్లకు ప్రత్యేక నిబంధనలు విధించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాలని.. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థల నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలో పరిస్థితిని చూసిన ఏపీ చంద్రబాబు అమరావతి నగరానికి అటువంటి ఇబ్బంది ఉండకూడదని ముందు చూపుతో ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. అమరావతి నగరానికి ఎటువంటి పరిస్థితిలోనైనా ఏడాది పొడవునా తాగునీరు అందించడానికి ప్రణాళిక రూపొందించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన నీటి నిల్వ ప్రాజెక్టును చేపట్టింది. ఈ నీరుకొండ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించారు. సుమారు 440 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం అవుతుంది. 0.4 టిఎంసిల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఈ రిజర్వాయర్ సొంతం.

ఈ రిజర్వాయర్ ప్రధానంగా అమరావతి ప్రజల దావీదు అవసరాలను తీర్చడంతో పాటు వరద నియంత్రణలో కూడా కీలకపాత్ర పోషించబోతోంది. వర్షాకాలంలో వచ్చే నీటిని నిలువ చేసుకోవడం ద్వారా వేసవిలోనూ నీటి లభ్యతను నిలుపుకోవాలని ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ రిజర్వాయర్ చుట్టూ సుమారు 158 ఎకరాల్లో పచ్చదనం.. గ్రీన్ స్పేస్ అభివృద్ధి చేస్తున్నారు. కేవలం నీటి నిల్వ కోసం మాత్రమే కాకుండా.. పర్యటకులను ఆకర్షించే విధంగా ఈ ప్రాంతాన్ని రూపొందించారు. ఇప్పటికే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే మార్చి ఏడాదినాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తారు. మొత్తంగా మీరు కొండ రిజర్వాయర్ అమరావతి భవిష్యత్తు నీటి అవసరాలను.. వరద నియంత్రణను.. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉంది. భవిష్యతు కాలంలో అమరావతి నగరానికి నీటికొరత తలెత్తకుండా ఉండేందుకు చంద్రబాబు ఎంతో ముందు చూపుతో ఈ రిజర్వాయర్ ఏర్పాటు చేశారు. కేవలం నీరుకొండ మీదమాత్రమే కాకుండా ..ఇతర నీటి వనరుల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏర్పడిన పరిస్థితిని మనసులో పెట్టుకుని అమరావతి నగరానికి భవిష్యత్ లో ఆ సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీరు కొండను దాదాపు 440 ఎకరాల్లో పెంచారంటే చంద్రబాబు అమరావతి విషయంలో ఎటువంటి ముందుచూపుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird