Home ఆంధ్రప్రదేశ్ Jana Sena: గ్లాసును పగలగొడితే ప్రతి ముక్కా పదునెక్కుద్ది.. – Andhra Waves

Jana Sena: గ్లాసును పగలగొడితే ప్రతి ముక్కా పదునెక్కుద్ది.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


జనసేన:స్థానిక ఎన్నికల్లో జనసేన మరోసారి సత్తా చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ ఎలా అయితే సాధించిందో.. స్థానిక ఎన్నికల్లో కూడా అదే స్థాయి ఫలితాలను మరోసారి రిపీట్ చేసింది. కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. టిడిపి.. బిజెపికి సహకరిస్తూ అదరగొట్టింది. కొన్ని ప్రాంతాల్లో జనసేన రెబల్ పోటీ చేసిన ఆదోని ప్రాంతంలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గ్లాస్ అదరగొట్టింది.

స్థానికంగా మొత్తం 86 మున్సిపాలిటీలు.. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి జయ కేతనం ఎగరవేసింది. 86 మున్సిపాలిటీలలో 83 స్థానాల మీద కూటమి జెండా ఎగరవేసింది. వైసీపీ ఖాతాలో నందికొట్కూరు.. బేతంచెర్ల.. నాయుడుపేట చేరాయి. జనసేన ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు, విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించారు. విల మెజారిటీ కూడా దాదాపు లక్షల్లో ఉంది. ఈ స్థాయిలో విజయం సాధించి.. తమకు కేటాయించిన స్థానాల్లో అదరగొట్టారు.

అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తిరుగులేని స్థాయిని చూపించింది. 100% స్ట్రైక్ రేట్ కొనసాగించండి. పొత్తు ధర్మాన్ని పాటించింది కూటమి. ఏ మాత్రం క్షేత్రస్థాయిలో ఇపరు లేకుండా చూసుకుంది. స్థానిక ఎన్నికల్లో కూడా అదే జోరు చూపించింది. పవన్ కళ్యాణ్ మాటలను శిరోధార్యంగా భావించి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు.. నాయకులు శ్రమించారు. వైసిపి ఎన్ని రకాలుగా విష ప్రచారం చేసినప్పటికీ.. కూటమిలో ఐక్యత లేదని సొంత మీడియాలో వండి వార్చేందుకు అదంతా కూడా ఊకదంపుడు ప్రచారమే అని నిరూపించింది. స్థానిక.. అంతకుముందు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం అంటే మాటలు కాదు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి.. కార్యకర్తల సంకల్పానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.. ఇదే జోరు జనసేన భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే తిరుగుండదని.. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేవలం కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నచోట మాత్రమే జనసేన సత్తా చూపించిందని గతంలో అనేకమంది విమర్శలు చేశారు. అయితే ఈసారి స్థానిక ఎన్నికల్లో ఆ విమర్శలను పటా పంచలు చేసింది జనసేన. అనువు గాని చోట్ల కూడా అదరగొట్టింది. దీనికి టిడిపి.. బిజెపి ఓటు బ్యాంకు కూడా కలిసి వచ్చింది. నుండి జనసేన ఘనవిజయం ఉంది. 100% స్ట్రైక్ రేట్ అంటే మాటలు కాదు. నేటి పాలిటిక్స్ లో తను సృష్టించిన రికార్డును తాను కొనసాగించడం అంటే అంత ఈజీ కాదు. కానీ దీన్ని చేతల్లో చేసి చూపించింది జనసేన. వచ్చిన స్థానాల్లో విజయం సాధించి.. మిగిలిన స్థానాల్లో టిడిపి విజయానికి కృషి చేసింది.

జనసేన మొత్తంగా నాలుగు కార్పొరేషన్లు.. 18 మున్సిపాలిటీలు.. మూడు నగర పంచాయతీల్లో పోటీ చేసింది. ఎన్నికల జరిగిన రెండు కార్పొరేషన్లు.. 15 మున్సిపాలిటీలు.. మూడు నగర పంచాయతీలను జనసేన గెలుచుకుంది. డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న పిఠాపురంలోని రెండు మున్సిపాలిటీలతో సహా ప్రస్తుత పార్టీ ఎమ్మెల్యేలు అన్ని చోట్ల మున్సిపాలిటీలను పొత్తులో భాగంగా జనసేన తీసుకుంది. కొత్త ప్రాంతాలకు విస్తరించేలాగా స్థానాలు కూడా తీసుకుంది. కొత్త నియోజకవర్గాలను పార్టీని విస్తరించినందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకుంది. వైసిపి.. టిడిపి నుంచి వచ్చిన వారికి కూడా కొన్ని చోట్ల అవకాశం కల్పించి.. కొత్త నాయకత్వం విస్తరణకు కృషి చేసింది. 2024 లో జరిగిన శాసనసభ.. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానంలో జనసేన గెలిచింది. ఆ రికార్డును ఈ స్థానిక ఎన్నికల్లో కూడా కొనసాగించండి..

పిఠాపురం.. పాలకొండ.. తెనాలి.. తాడేపల్లి.. భీమవరం.. నరసాపురం.. కాకినాడ వంటి ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులగూడెం.. అక్కడ మున్సిపల్.. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పొత్తులను స్వీకరించింది. అయితే కాకినాడ.. తాడేపల్లిగూడెం.. భీమవరం ప్రాంతాల్లో ఎన్నికలు జరగలేదు. కీలకమైన విజయవాడ నగరంలో మేయర్ స్థానానికి పోటీ చేసి గెలిచింది. ఇక్కడ వంగవీటి రాధాకృష్ణకు అవకాశం కల్పించింది. ఏలూరు కార్పొరేషన్.. శ్రీకాకుళంలో కొత్తగా పార్టీని విస్తరించినందుకు పొత్తులు కుదుర్చుకుంది. తుని.. పెద్దాపురం (సామర్లకోట మున్సిపాలిటీ), దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, మడకశిర, పుట్టపర్తి, నగరి (పుత్తూరు మున్సిపాలిటీ) నియోజకవర్గాలకు పార్టీని విస్తరించే విధంగా కృషి చేసింది. అయితే ఇక్కడ తీసుకున్న స్థానాలలో జనసేన గెలవడం విశేషం.

డిప్యూటీ సీఎం నిర్వహిస్తున్న పిఠాపురం పురపాలకంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. పూర్తి స్థాయిలో మెజారిటీని దక్కించుకున్నారు. అయితే ఇక్కడ 10 వార్డులలో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. వీరిలో కొందరు కూటమి రెబల్స్, ఇద్దరు వైసిపి రెబల్స్ ఉన్నారు. జనసేన నుంచి చైర్మన్ అభ్యర్థిగా నిలిచిన దానం లాజర్ తన సమీప ప్రత్యర్థి పెదపాటి రాజేష్ కుమార్ మీద 9235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో మూడు గతంలోని జనసేనకు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 33 వార్డులలో జనసేన 16.. టిడిపి ఐదు.. బిజెపి ఒకటి.. ఇండిపెండెంట్ లు 10 వార్డులలో గెలిచారు. కేవలం 19వ వార్డులో మాత్రమే వైసిపి విజయం సాధించింది. ఏకగ్రీవం కలుపుకొని జనసేనకు 25 స్థానాలు లభించాయి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird