Home ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పరిషత్: జగన్ కడపకు మరోసారి “పసుపు” పూసారు.. – Andhra Waves

కడప జిల్లా పరిషత్: జగన్ కడపకు మరోసారి “పసుపు” పూసారు.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


కడప జిల్లా పరిషత్: ఇది మామూలు చరిత్ర కాదు.. వైయస్సార్ కడపలో “దేశం” సరికొత్త ఘనతను సృష్టించింది. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లా పరిషత్ కుర్చీని 27 ఏళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత టిడిపి సొంతం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో మొత్తం 39 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసే సమయానికి.. ఏకంగా 23 స్థానాలు టిడిపి ఖాతాలోకి వచ్చేసాయి.. దీంతో ఎన్నికలు జరగకముందే క్లియర్ మెజారిటీ […]

కడప జిల్లా పరిషత్: ఇది మామూలు చరిత్ర కాదు.. వైయస్సార్ కడపలో “దేశం” సరికొత్త ఘనతను సృష్టించింది. రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట లాంటి కడప జిల్లా పరిషత్ కుర్చీని 27 ఏళ్ల సుదీర్ఘ విరమణ తర్వాత టిడిపి సొంతం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో మొత్తం 39 జడ్పీ స్థానాలు ఉన్నాయి. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసే సమయానికి.. ఏకంగా 23 స్థానాలు టిడిపి ఖాతాలోకి వచ్చేసాయి.. దీంతో ఎన్నికలు జరగకముందే క్లియర్ మెజారిటీ టిడిపి కూటమి సొంతం చేసుకుంది.

ఈ మెజారిటీ ద్వారా కడప జడ్పీ సీటు టిడిపి ఖాతాలోకి వెళ్లిపోయింది. కడప జిల్లా పరిధిలో ఉన్న కమలాపురం సెగ్మెంట్‌లో మొత్తం ఆరు స్థానాలను టిడిపి దక్కించుకుంది. అదికూడా యునానిమస్ గా.. జమ్మలమడుగులో 4.. జగన్ నిర్వహిస్తున్న పులివెందులలో.. మైదుకూరు ప్రాంతంలో మూడు.. బద్వేలు ప్రాంతంలో మూడు.. రాజంపేట ప్రాంతంలో రెండు.. ప్రొద్దుటూరు ప్రాంతంలో రెండు స్థానాలు టిడిపి సొంతమయ్యాయి. గతంలో నామినేషన్ కూడా వేసే పరిస్థితి ఉండేది కాదు. అప్పట్లో అత్యంత భయానకమైన పరిస్థితి.. మొత్తంగా 23 మండలాల్లో ప్రత్యర్థులు తనకు నిలబడే అవకాశం కూడా లేకపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయంగా స్పష్టంగా మార్పు వచ్చింది.

ఫ్యాన్ పార్టీకి కడప పెట్టని కోట లాంటిది. అటువంటి ప్రాంతంలో నిజంగా ఈ స్థాయిలో దిగజారిపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. జగన్ షర్టుపెట్టి.. 2.0.. చూసుకుందాం.. అని సవాళ్లు విసురుతున్నప్పటికీ.. కనీసం ఆ మండలాల్లో టీడీపీకి పోటీ ఇవ్వడానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సుదీర్ఘ కాలం తర్వాత కడపలో పసుపు రంగు జెండా గర్వంగా ఎగిరింది. టిడిపి.. జనసేన.. బిజెపి నాయకులు తీసుకుంటున్నారు. 1990 చివరి కాలంలో టిడిపి కడపలో జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. మళ్లీ దాదాపు ఇన్ని సంవత్సరాలు టిడిపికి ఆ అవకాశం లభించింది..” ఫ్యాన్ పార్టీ అధినేత సొంతింటికి అన్యాయం చేశాడు.. నమ్ముకున్న వాళ్లను బయటికి పంపేశాడు. అటువంటి వ్యక్తి ఎవరికీ న్యాయం చేయలేడు.

అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో టీడీపీ గెలిచింది. ఆ మధ్య జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా కడపలోనే పసుపు రంగుజెండా రెపరెపలాడింది. మొత్తానికి గత పరాజయాలకు చరమగీతం పాడుతూ.. జగన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ టీడీపీ తిరుగులేని చరిష్మాను దక్కించుకుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird