Home సినిమా 38 మందిని చంపి తిన్న రాక్షసుడికి.. – Andhra Waves

38 మందిని చంపి తిన్న రాక్షసుడికి.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
38 మందిని చంపి తిన్న రాక్షసుడికి..


సాధారణంగా కథల్లో నరమాసం భక్షకుల గురించి విన్నాం. బకాసురుడు వంటి రాక్షసులు మనుషులను తినే వారని చదివాం. అప్పుడెప్పుడో విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఓ వ్యక్తి.. బతికుండడానికి శవాలను పిక్కు తిన్నాడని వార్తల్లో చూశాం. కానీ నేటి ఇంటర్నెట్ యుగంలో కూడా ఇలాంటి ఓ రాక్షసుడు ఉన్నాడు. ఒక్కరు, ఇద్దరు కాదు 38 మందిని చంపి తిన్నాడనే ఆరోపణలు నమోదయ్యాయి. తాజాగా ఈ నరమాంస భక్షకుడిని అరెస్ట్ చేశారు.

ఉగాండా దేశంలో దశాబ్దానికి పైగా గజగజ వణికించిన అత్యంత దారుణమైన సిరియల్ కిల్లర్, నరమాంస భక్షకుడు ఎట్టకేలకు భద్రతా దళాల చేతికి చిక్కాడు. గత 15 ఏళ్ల వ్యవధిలో 38 మందిని దారుణంగా చేసి, వారి మాంసాన్ని తిన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముజురిజి మోజెస్ అనే నరరూప రాక్షసుడిని హత్య చేసినట్లు ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ జనరల్ ముహూజీ కైనెరుగాబా అధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ అరెస్టుతో ఏళ్లతరబడి సాగుతున్న భయానక ఉదంతం వెలుగులోకి వచ్చి అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

‘ఎక్స్’ వేదికగా ఆర్మీ చీఫ్ ప్రకటన

ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ భయంకరమైన కేసు వివరాలను పంచుకున్నారు. ఉగాండా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సిరియల్ కిల్లర్ ముజురిజి మోజెస్ అని ఆయన పేర్కొన్నారు. 2010 నుంచి 2025 మధ్యకాలంలో మసాకా, ఇబాండా, కాజో జిల్లాల్లో 38 మందిని మోజెస్ చంపి తిన్నాడని సమాచారం. అతడికి బహిరంగ విచారణ జరిపి, తప్పకుండా మరణశిక్ష విధిస్తామని కైనెరుగాబా స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : శారీరక వేధింపులు.. బాధితులకు రూ.7 వేల కోట్ల పరిహారం

అర్ధరాత్రి ఇళ్ల గోడలు కూలగొట్టి దాడులు

మోజెస్ చేసిన దారుణాలు స్థానిక దర్యాప్తు సంస్థలను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి:

  • కుటుంబాలే లక్ష్యంగా: మోజెస్ కుటుంబాన్నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడేవాడని దర్యాప్తులో తేలింది.
  • పాస్టర్ కుటుంబం నరికివేత: స్థానిక కథనాల ప్రకారం, పెంటెకోస్టల్ పాస్టర్ స్టీవెన్ ముగాంబే ఇంటి గోడను కూలగొట్టి లోపలికి వెళ్లి, ఇంట్లోని సభ్యులందరినీ దారుణంగా నరికి చంపిన ఘోరమైన సంఘటనలోనూ మోజెస్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
  • మాయమాటలతో వల: కొన్ని సందర్భాల్లో సంబంధాలు కలుపుకుంటామని బాధితులకు ఆశ చూపి, వారిని లోబరుచుకుని ఆపై అంతమొందించేవాడని సమాచారం.

కేసుల పునఃపరిశీలన.. మిస్సింగ్ కేసులపై దృష్టి

గతంలో పలుమార్లు పట్టుబడినప్పటికీ అనుమానస్పద పరిస్థితుల్లో మోజెస్ తప్పించుకోవడం, విడుదల కావడం జరిగింది. ఈసారి భద్రతా బలగాలు పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకుని, నివాసం నుంచి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మోజెస్‌పై వచ్చిన ఆరోపణలను కోర్టు ద్వారా నిరూపించాల్సి ఉంది, గతంలో కాకుండా మిగిలిపోయిన మిస్ కేసులు, హత్యల రికార్డులను దర్యాప్తు చేస్తున్న అధికారులు రిశీలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 15 ఏళ్ల వేట ముగిసి అతడు దొరకడంతో ఉగాండా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రచయిత అవతార్

ధరణి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird